Telugu Gateway
Top Stories

కలకలం రేపుతున్న జడ్జిల లేఖలు

కలకలం రేపుతున్న జడ్జిల లేఖలు
X

హై కోర్టు జడ్జిల తీరు ఈ మధ్య తీవ్ర విమర్శల పాలు అవుతోంది. వరుసపెట్టి బయటకు వస్తున్న లేఖలు వీరి ప్రవర్తనను చర్చనీయాంశంగా మారుస్తున్నాయి. ఇటీవల వరకు ఢిల్లీ హై కోర్టు జడ్జిగా వ్యవహరించిన జస్టిస్ గౌరంగ్ కాంత్ రాసిన లెటర్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులోని అంశాలు చర్చనీయాంశగా మారాయి. ఢిల్లీ హై కోర్టు జడ్జిగా ఉన్న గౌరంగ్ కాంత్ గత నెలలో అంటే జూన్ 12 న ఢిల్లీ జాయింట్ కమీషనర్ అఫ్ పోలీస్ (సెక్యూరిటీ)కి ఒక లేఖ రాశారు. ఎంతో బాధతో..ఆవేదనతో తాను ఈ లెటర్ రాస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. తన అధికారిక నివాసంలో భద్రత కోసం కేటాయించిన అధికారుల్లో అంకిత భావం లేకపోవటం, చేతకానితనం వల్ల తాను తన పెంపుడు కుక్కను పోగొట్టుకున్నట్లు లేఖలో ప్రస్తావించారు. తలుపు లాక్ చేసి ఉంచాలని తాను ఎన్నో సార్లు చెప్పిన పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది అని..వాళ్ళు తన సూచనలను కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు అన్నారు. విధుల్లో ఇంతటి నిర్లక్ష్యం, అసమర్ధ చూపించే వాళ్ల వల్ల తన ప్రాణాలకు..స్వేచ్ఛకు ముప్పు ఉంది అని... ఇలాంటి భద్రత సిబ్బంది వల్ల తాను భయపడాలి వస్తోంది అని లెటర్ లో ప్రస్తావించారు. ఈ అంశాలు అన్ని పరిశీలించి తన అధికారిక నివాసం వద్ద బాధ్యతలు చూస్తున్న వారిని వెంటనే సస్పెండ్ చేయాలని...వాళ్ళు అసలు ప్రభుత్వ విధుల నిర్వహణకు ఏ మాత్రం పనికి రారు అన్నారు. వీరిని సస్పెండ్ చేసి విచారణ జరిపించటంతో పాటు మూడు రోజుల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ను సమర్పించాలని జడ్జి ఆదేశించారు.

ఇదే తరహాలో కొద్ది రోజుల క్రితం అలాహాబాద్ హై కోర్టు జడ్జి గౌతమ్ చౌదరి కూడా తాను న్యూ ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ వెళుతున్న సమయంలో తనకు అసౌకర్యం కలిగించారు అని..దీనిపై వివరణ ఇవ్వాలి అంటూ ఉత్తర మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు లేఖ రాశారు. పలు మార్లు కోరినా కూడా పాంట్రీ కార్ సిబ్బంది జడ్జి కి అవసరం అయినా ఫలహారాలు అందించలేదు అని, పాంట్రీ కార్ మేనేజర్ ఎన్ని కాల్స్ చేసిన కూడా స్పందించలేదు అని తన లేఖలో ప్రస్తావించారు. ఈ లేఖ పై సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్త్రి డీ వై చంద్రచూడ్ కూడా స్పందించారు. జడ్జి లకు ఉన్న ప్రోటోకాల్ హక్కులను ఉపయోగించుకునే విషయంలో ఆచితూచి వ్యవరించాలని సూచించారు. అంతేకాని వీటి ఆధారంగా చర్యలు తీసుకోవాలని చూడటం సరికాదు అన్నారు. ఈ రెండు లేఖలు ఇప్పుడు ఆన్ లైన్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకరు ఏమో కుక్క తప్పిపోయింది అని..మరొకరు తనకు స్నాక్స్ ఇవ్వలేదు అని ఫిర్యాదు చేయటంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు

Next Story
Share it