Telugu Gateway
Top Stories

గాడిన పడుతున్న ఎయిర్ లైన్స్

గాడిన పడుతున్న ఎయిర్ లైన్స్
X

టాటా ల చేతికి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా గాడిన పడుతుందా?. అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. గతంలో ఎయిర్ ఇండియా కు రోజు వారీ వచ్చే ఆదాయం డెబ్భై కోట్ల రూపాయలు ఉండగా ..ఇప్పుడు అది వంద కోట్ల రూపాయలకు చేరింది. మరో వైపు ఎయిర్ ఇండియా యాజమాన్యం నష్టాలను తగ్గించుకునేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. 2022 జనవరి లో కేంద్రం నుంచి ఎయిర్ ఇండియా టాటా ల చేతికి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి టాటా గ్రూప్ ఈ ఎయిర్ లైన్స్ లో పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎయిర్ ఇండియా నికర నష్టాలను 2500 కోట్ల రూపాలకు తగ్గించుకోలిగింది.

నిర్వహణ పనితీరును మెరుగుపర్చుకునేందుకు చేపట్టిన భారీ పునర్వ్యవస్థీకరణ ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. మరో వైపు ఈ ఎయిర్ లైన్స్ 400 మిలియన్ డాలర్స్ తో ఎయిర్ ఇండియా తన చేతిలో ఉన్న విమానాలను ఆధునికీకరించటం తో పాటు సౌకర్యాలను మెరుగుపర్చాలని నిర్ణయించుకుని..ఈ దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అటు దేశీయ రూట్ల తో పాటు అంతర్జాతీయ రూట్ల లో కూడా ప్రయాణికుల సంఖ్య పెరగటం కూడా ఎయిర్ ఇండియా కు కలిసి వచ్చింది.

Next Story
Share it