Telugu Gateway
Telugugateway Exclusives

ఆయన రాజకీయాలు వదిలేసినా..ఆయన్ను వదలని రాజకీయాలు

ఆయన రాజకీయాలు వదిలేసినా..ఆయన్ను వదలని రాజకీయాలు
X

రాజకీయాలకు దూరం అయి . ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టినా ఆయన్ను మాత్రం రాజకీయాలు వీడటం లేదు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ సోషల్ మీడియా లో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయారు. ముఖ్యంగా హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ఎన్టీఆర్ దూరంగా ఉండటంపై తెలుగు దేశం అభిమానులు పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు ఈ హీరోను . ఈ దూషణలు మరీ అతిగా సాగాయి అనే విమర్శలు ఉన్నాయి. ఏడాది పాటు జరిగిన ఏ ఒక్క కార్యక్రమానికి పిలవకుండా కేవలం జూ ఎన్టీఆర్ పుట్టిన రోజున అంటే మే 20 వ తేదీన తలపెట్టిన కార్యక్రమానికి మాత్రం పిలిచారు. హైదరాబాద్ లో అయితేనే తాను వస్తానని ఎన్టీఆర్ ఏమి షరతు పెట్టలేదు కదా. చివరకు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పత్రికలో ఇచ్చిన యాడ్ విషయంలోనే కొంత మంది విమర్శలు గుప్పించారు. మళ్ళీ వచ్చాడు అండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేశారు.

ఎన్టీఆర్ శతజయంతి సందర్భగా ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ కూడా మహానాడు కు పోటీగా అన్నట్లు కార్యక్రమాలు పెట్టి ఒక వైపు తెలుగు దేశం, చంద్రబాబు పై విమర్శలు చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ పై మాత్రం పొగడ్తల వర్షం కురిపించారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏకంగా ఎన్టీఆర్ ఒక్కడే దమ్ము ఉన్న మగాడు అని...అందుకే వాళ్ళతో వేదిక పంచుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఎన్టీఆర్ రాజకీయాలు వదిలేసినా ఆయన్ను మాత్రం రాజకీయాలు వదలటం లేదు అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో బాలీవుడ్ హీరో క్రిష్ తో కలిసి వార్ 2 లోనూ, 2024 మర్చి లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇలా ఎన్టీఆర్ వరస సినిమాలతో బిజీ గా ఉన్న వచ్చే ఏడాది ఎన్నికలు అయి పోయే వరకు ఏదో ఒక రకంగా అయన పేరు అలా రాజకీయాల్లో నలుగుతూనే ఉండేలా ఉంది.

Next Story
Share it