Telugu Gateway
Telugugateway Exclusives

పవన్ కళ్యాణ్ నూ 'ఫిక్స్' చేసిన బండి సంజయ్

పవన్ కళ్యాణ్ నూ ఫిక్స్ చేసిన బండి సంజయ్
X

మరి జనసేన కూడా బైబిల్ వర్సెస్ భగవద్గీతే అంటుందా?

పోటీచేసేది ఎవరో తేలకుండానే ఏజెండా ఫిక్స్ చేయటం వ్యూహాత్మకమా?

ఏజెండా డిసైడ్ చేయాల్సిన జనసేన...తోక పార్టీగా మారడానికి కారణలేంటి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫిక్స్ చేసినట్లే కన్పిస్తోంది. అసలు తిరుపతి ఎన్నికలో బిజెపి పోటీ చేస్తుందా?. లేక జనసేన అన్న విషయమే తేలలేదు. ఢిల్లీ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ మాత్రం దీని కోసం కమిటీ వేస్తున్నారు..కమిటీ నిర్ణయిస్తుంది అని ప్రకటించారు. కానీ బిజెపి నేతలేమో అవేమి పట్టించుకోకుండా పోటీచేసేది తామే అంటూ వస్తున్నారు. ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే బిజెపి, జనసేన ఉమ్మడి అభ్యర్ధి ఉంటారు అంటూ ప్రకటిస్తున్నారు. తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో 'ఏజెండా ఫిక్స్' చేయటంతోపాటు ఎవరు పోటీ చేయబోతున్నారో స్పష్టం చేసినట్లు అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి ఇదే ఏజెండాను జనసేన ఆమోదిస్తుందా? ఎప్పటిలాగానే బిజెపి నిలిపే అభ్యర్ధికి మద్దతు ఇస్తూ మరోసారి మౌనంగా చూస్తూ ఉంటుందా అన్నది వేచిచూడాల్సిందే.

బిజెపితో పోలిస్తే ఏపీలో పవన్ కళ్యాణ్ కే బలం ఎక్కువ. కానీ ఆయన రాజకీయంగా ఏమీ డిసైడ్ చేసే పరిస్థితి లేదు. బిజెపి ఏది అంటే అదే ఓకే అనాల్సిన పరిస్థితి. ముందేమో అమరావతే రాజధానిగా ఉంటుంది..ఆ మేరకు హామీ ఇచ్చాకే పొత్తు పెట్టుకున్నాం అన్నారు. తర్వాత రాజధాని నిర్ణయం రాష్ట్రం చేతిలో ఉంటుంది కేంద్రం ఏమీ చేయలేదు..మేం మాత్రం చివరి రైతుకు న్యాయం వరకూ పోరాటం చేస్తామన్నారు. మధ్యలో బిజెపి యూటర్న్ తీసుకుని రాజధాని అమరావతిలోనే ఉండాలి అని మాట మార్చింది. ఇలా బిజెపి ఎప్పటికప్పుడు తన ఆట తాను ఆడుతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చూస్తూ ఉండాల్సిన పరిస్థితి. తిరుపతి ఉప ఎన్నిక విషయంలోనూ అదే జరుగుతోంది.

ఏపీలో బిజెపి కంటే బలంగా ఉన్న జనసేన ఎందుకు బిజెపికి తోక పార్టీగా మారిపోయింది. ముఖ్యమంత్రి జగన్ తోపాటు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడులు ఇద్దరూ వారి వారి కారణాలతో కేంద్రంతో, మోడీతో ఢీ అంటే ఢీ అనలేని పరిస్థితి. కానీ బిజెపికి సరెండర్ కావాల్సిన 'గత చరిత్ర'లు ఏమీ లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎందుకిలా సరెండర్ అయ్యారన్నది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. తిరుపతి ప్రజలు బైబిల్ పార్టీ కావాలో...భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల ఘటనపై ప్రభుత్వాన్ని విమర్శించటంలో తప్పులేదు కానీ...ఇలా బైబిల్ పార్టీ..భగవద్గీత పార్టీ అంటూ వ్యాఖ్యానించటం కలకలం రేపుతోంది.

Next Story
Share it