Telugu Gateway
Telangana

తెలంగాణలో తొలి వ్యాక్సిన్ తీసుకున్న కృష్ణమ్మ

తెలంగాణలో తొలి వ్యాక్సిన్ తీసుకున్న కృష్ణమ్మ
X

తెలంగాణలో తొలి వ్యాక్సిన్ తీసుకున్న మహిళగా పారిశుధ్య కార్మికురాలు కృష్ణమ్మ నిలిచింది. తొలి దశలో దేశ వ్యాప్తంగా మూడు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ప్రారంభం అయిన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. గాంధీ ఆస్పత్రిలో తొలుత కృష్ణమ్మకు తొలి వ్యాక్సిన్ వేశారు. నిమ్స్‌ లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మనదేశంలో వ్యాక్సిన్ విడుదల కావడం చాలా గర్వంగా ఉందన్నారు.

వ్యాక్సిన్ విషయంలో భయం ,ఆందోళన అవసరం లేదని, అన్ని పరీక్షల తరువాతే వ్యాక్సిన్ వచ్చిందని ఆమె తెలిపారు. భారత్ బయోటెక్‌కు చెందిన కోవ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి రానుందన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో లో 50 వేలమంది సిబ్బంది పాల్గొంటారు. వ్యాక్సిన్‌ వేసేందుకు 10 వేలమంది వైద్యసిబ్బందికి ప్రత్యేకశిక్షణ ఇచ్చారు. మొత్తం 1,213 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్లు వేయాలని అధికారులు నిర్ణయించారు. తొలిరోజు కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోని 140 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ వేస్తారు. ప్రతి కేంద్రంలో 30 మంది చొప్పున 4,200 మందికి టీకా వేయనున్నారు.

Next Story
Share it