Telugu Gateway
Telangana

అసెంబ్లీ ర‌ద్దుకు మేం రెడీ..పార్ల‌మెంట్ ర‌ద్దుకు మీరు రెడీనా?

అసెంబ్లీ ర‌ద్దుకు మేం రెడీ..పార్ల‌మెంట్ ర‌ద్దుకు మీరు రెడీనా?
X

టీఆర్ఎస్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేసిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీపై అధికార టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. రాష్ట్రంలో అమ‌లు అవుతున్న ప‌థ‌కాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్క‌డైనా ఉన్నాయా అని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ ప్ర‌శ్నించారు. అంతే కాదు..అసెంబ్లీ ర‌ద్దు చేసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు మేం వ‌స్తాం..పార్ల‌మెంట్ ను ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వ‌చ్చే ద‌మ్ము బిజెపికి ఉందా అని త‌ల‌సాని స‌వాల్ విసిరారు. హైద‌రాబాద్ స‌మావేశంలో మోడీ మాట్లాడిన తీరును ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. మ‌రో మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తో క‌ల‌సి త‌ల‌సాని శుక్ర‌వారం నాడు మీడియాతో మాట్లాడారు. కేవలం తెలంగాణ పైనా, ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా ప్రధాన మంత్రి మోదీ తన అక్కసు వెళ్లబోసుకున్నారని విమ‌ర్శించారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా?కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని అన్నారు.రాష్ట్రానికో వేషం, తీరొక్క డ్రెస్సు లతో షో చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ప్రశ్నించిన వారిని కేంద్ర సంస్థలను అడ్డం పెట్టుకొని బెదిరించాలని చూస్తే ఎవరూ భయపడరని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోడెద్దుల లాగా అమలు అవుతున్నాయి.తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ సాధన కోసం జరిగిన అనేక ఉద్యమాల్లో కెసీఆర్ కుటుంబం పాల్గొన్నది.ఇష్టానుసారంగా మాట్లాడుతున్నబిజెపి నేతలను కట్టడి చేయాల్సిన బాధ్యత అధినాయకత్వానిదేనని,తెలంగాణ రాష్ట్రం ఎంతో సురక్షితంగా ఉన్నందున భారీగా పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు.ప్రధానికి ముఖ్యమంత్రులు ఎందుకు స్వాగతం పలికేందుకు రావడం లేదో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

Next Story
Share it