Telugu Gateway
Telangana

ఈ సారి ఖైర‌తాబాద్ వినాయ‌కుడి ఎత్తు ఎంతో తెలుసా?

ఈ సారి ఖైర‌తాబాద్ వినాయ‌కుడి ఎత్తు ఎంతో తెలుసా?
X

వినాయ‌క‌చ‌వితి అంటే హైదరాబాద్ లో అంద‌రి చూపు ఖైర‌తాబాద్ వినాయ‌కుడి వైపే ఉంటుంది. ఇక్క‌డ ఏర్పాటు చేసే వినాయ‌కుడి ప్ర‌త్యేక‌త అంద‌రికీ తెలిసిందే. అత్యంత ఎత్తైన గ‌ణ‌ప‌తిని ఏర్పాటు చేయ‌టం ఇక్క‌డ ఆన‌వాయితీ. గ‌త ఏడాది క‌రోనా కార‌ణంగా వినాయ‌కుడి ఎత్తును 18 అడుగుల‌కే ప‌రిమితం చేశారు. ప్ర‌స్తుతం క‌రోనా రెండ‌వ ద‌శ శాంతించినందున ఈ సారి 40 అడుగుల వినాయ‌కుడిని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఈ మేర‌కు భాగ్య‌న‌గ‌ర ఉత్స‌వ స‌మితి నిర్ణ‌యం తీసుకుంది. దీనికి సంబంధించిన మోడ‌ల్ ను కూడా శ‌నివారం నాడు విడుద‌ల చేశారు. ఈ సారి ఖైర‌తాబాద్ వినాయ‌కుడు పంచ‌ముఖ రుద్ర మ‌హ గ‌ణ‌ప‌తిగా ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. క‌రోనా రాక ముందు 61 అడుగుల ఎత్తుతో ఖైర‌తాబాద్ వినాయ‌కుడిని ప్ర‌తిష్టించారు. ఇప్ప‌టికే ఖైర‌తాబాద్ వినాయ‌కుడి విగ్ర‌హ ఏర్పాట్ల‌కు సంబందించిన ప‌నులు ప్రారంభం అయ్యాయి.

Next Story
Share it