Telugu Gateway
Telangana

ద‌ళిత బంధుపై కెసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

ద‌ళిత బంధుపై కెసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ గ‌త కొంత కాలంగా ద‌ళిత బంధు జ‌పం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఇది త‌ప్ప వేరే అంశం ఏమీ మాట్లాడ‌టం లేదు. సోమ‌వారం నాడు ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో ఈ అంశంపై అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించారు. దీనికి హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచే ఎక్కువ మందిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. దళితబంధు కేవలం కార్యక్రమం కాదు.. ఉద్యమం అని వ్యాఖ్యానించారు. మంచి కార్యక్రమానికి ప్రతికూల శక్తులు ఉంటాయ‌ని, మనలో పరస్పర సహకారం పెరగాలి.. ద్వేషాలు పోవాల‌న్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'దళిత బంధు' పథకానికి సంబంధించి ఈ నెల 26న ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ రెండు రోజుల క్రితం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతే కాదు స‌మావేశానికి హాజ‌రైన వారంతా కూడా ఈ ప‌త‌కంపై పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయాల‌ని కెసీఆర్ కోరారు. ఈ ప‌థ‌కం కింద అవ‌స‌రం అయితే ల‌క్ష కోట్ల రూపాయ‌లు అయినా ఖ‌ర్చు పెట్ట‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Next Story
Share it