Telugu Gateway
Telangana

సోనియాపై అనుచిత వ్యాఖ్యలు..కేఏ పాల్ పై ఫిర్యాదు

సోనియాపై అనుచిత వ్యాఖ్యలు..కేఏ పాల్ పై ఫిర్యాదు
X

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే.ఏ.పాల్ పై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. భారతదేశంలో అవినీతిని పెంపొందింపజేసి, దేశాన్ని అస్థిర పరిచేందుకు అమెరికా, ఇటలీ లాంటి దేశాలు సోనియాగాంధీ ద్వారా పన్నిన కుట్రలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిక్కుకున్నారని ఈనెల 2న పాపులర్ టీవీ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్ఫ్యూలో చెప్పారని బండి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేగాకుండా సోనియాగాంధీని అవమాన పరిచే రీతిలో ఓల్డ్ లేడీ, విడో, చీటర్, లయర్, సైతాన్ అని కే.ఏ.పాల్ తన ఇంటర్ఫ్యూలో చెప్పారని బండి ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ టీవీ నెట్ వర్క్స్ రెగ్యులరైజేషన్ అమెండ్ మెంట్ యాక్ట్ 2000(36/2000) ప్రకారంగా పోలీసు కమిషనర్ కే.ఏ.పాల్ పై కేసు నమోదు చేయాలని బండి కోరారు. శాంతిని బోధించే బైబిల్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేఏ పాల్ 48 గంటల్లోగా సోనియాపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని బండి సుధాకర్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలుగు ప్రజలకు హానిచేసే చీడపురుగు కేఏ పాల్ అని ఆయన అన్నారు. కే.ఏ పాల్ మత ప్రబోధకుడా? రాజకీయ నాయకుడో తేల్చుకోవాలన్నారు.

Next Story
Share it