Telugu Gateway
Telangana

కారు 2023లో శాశ్వతంగా షెడ్డుకే

కారు 2023లో శాశ్వతంగా షెడ్డుకే
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఇఫ్పటికైనా మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వాలని తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గడీ వదిలి బయటకు వచ్చి ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో అల్లుడికి దెబ్బపడితే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొడుకు కు దెబ్బపడిందని సంజయ్ వ్యాఖ్యానించారు. 2023లో కారు శాశ్వతంగా షెడ్డుకు పోవటం ఖాయం అని వ్యాఖ్యానించారు. అడ్డదారిలో తాము మేయర్ పీఠం ఎక్కాలనుకోవటంలేదని..ప్రజలు అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తామని తెలిపారు. ఎంఐఎంతో తమకు ఏ మాత్రం సంబంధంలేదని ప్రకటిచించిన టీఆర్ఎస్ ఇప్పుడు ఆ పార్టీతో కలసి మేయర్ పీఠం దక్కించుకుంటే ప్రజలే తగిన శాస్తి చేస్తారని అన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం దొడ్డిదారిన గెలించేందుకు ప్రయత్నించాయని ఆరోపించారు. టీఆర్ఎస్ గెలుపు కోసం ఆ పార్టీ కార్యకర్తల కంటే ఎస్ఈసీ ఎక్కువ కష్టపడ్డారని, డీజీపీ కూడా తన వంతు సాయం చేశారని, బిజెపి గెలుపును వారిద్దరికి అంకితమిస్తున్నట్లు పేర్కొన్నారు. బిజెపి కార్యకర్తలపై దాడులను డీజీపీ ఏ మాత్రం పట్టించుకోలేదని సంజయ్ విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని ప్రశంసించారు. అభివృద్ధి, ఆత్మగౌరవం కోరుకున్న హైదరాబాద్ ప్రజలు బిజెపికి మంచి మెజారిటీ ఇఛ్చారన్నారు. వారందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. బిజెపి కార్యాలయంలో నేతలు, కార్యకర్తలు జీహెచ్ఎంసీలో గెలుపును ఆస్వాదిస్తూ మిఠాయిలు పంచుకున్నారు.

Next Story
Share it