Telugu Gateway
Politics

తెలంగాణ మంత్రుల‌ను మేం పిల‌వ‌లేదు

తెలంగాణ మంత్రుల‌ను మేం పిల‌వ‌లేదు
X

ధాన్యం సేక‌ర‌ణ అంశం బిజెపి, టీఆర్ఎస్ ల మ‌ధ్య రాజ‌కీయ వార్ గా మారుతోంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ మంగ‌ళ‌వారం నాడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల వద్ద తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ మండిపడ్డారు. మంగళవారం ఆయన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కేంద్రమంత్రులంతా బిజీగా ఉన్నామని.. తెలంగాణ మంత్రులకు ఖాళీ ఎలా దొరికిందని ఆయన ప్రశ్నించారు. వారు శనివారం నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. తెలంగాణ మంత్రులను తాము ఆహ్వానించలేదన్నారు. సీఎం కెసీఆర్ ధాన్యం సేక‌ర‌ణ అంశంపై అబ‌ద్దాలు చెబుతున్నార‌ని విమర్శించారు. ర‌బీ సీజ‌న్ లో ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య ఒప్పందం కుదిరింద‌ని..దీని ప్ర‌కారం కూడా ఇంకా ధాన్యం స‌ర‌ఫ‌రా చేయలేద‌న్నారు.

ఒప్పందంలో ఉన్న దాని కంటే అద‌నంగా 20 ల‌ క్షల ట‌న్నుల ఉప్పుడు బియ్యం సేక‌ర‌ణ‌కు సైతం అంగీకారం తెలిపామ‌ని వెల్ల‌డించారు. ఈ అవ‌కాశం ఒక్క తెలంగాణ‌కు మాత్ర‌మే ఇచ్చామ‌న్నారు. నాలుగుసార్లు గ‌డువు పొడిగించినా కూడా తెలంగాణ ప్ర‌భుత్వం ధాన్యం స‌ర‌ఫ‌రా చేయ‌లేద‌న్నారు. ధాన్యం సేక‌ర‌ణ‌లో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని మండిప‌ప‌డ్డారు. మ‌రో కేంద్ర మంత్రి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను అయోమయానికి గురిచేస్తోందని అన్నారు. ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఎంవోయూ ప్రకారమే ధాన్యం సేకరణ జరుగుతోందన్నారు. ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకుంటాం. ఐదేళ్లలో ధాన్యం మూడు రెట్లు పెరిగిందన్నారు.

Next Story
Share it