Telugu Gateway
Politics

అంద‌రినీ భ‌య‌పెట్టేందుకేనా ఈ బ‌దిలీ

అంద‌రినీ భ‌య‌పెట్టేందుకేనా ఈ బ‌దిలీ
X

ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ బదిలీపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. డీజీపీని ఆక‌స్మికంగా ఎందుకు బ‌దిలీ చేశారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న‌లో డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఈ రోజు మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్న గౌతమ్ సవాంగ్ ని ఆకస్మికంగా ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం విస్మయం కలిగించింది. అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావచ్చు... కానీ వైసీపీ ప్రభుత్వానికి డీజీపీనిహఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందో? ఇందుకుగల కారణాలను ప్రజలకు తెలియచెప్పాలి.

లేని పక్షంలో - విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే సవాంగ్ పై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుంది. ఉన్నతాధికారుల నుంచి చిన్నపాటి ఉద్యోగి వరకూ అందరినీ హెచ్చరించి.. భయపెట్టి.. అదుపు చేసేందుకు సవాంగ్ బదిలీని ఉదాహరణగా చూపించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది. ఈ బదిలీ తీరు చూస్తే వైసీపీ ప్రభుత్వం చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం ని ఆకస్మికంగా పక్కకు తప్పించడమే గుర్తుకు వస్తుందన్నారు.

Next Story
Share it