Telugu Gateway
Politics

కేంద్రంలో ఎనిమిది ల‌క్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి

కేంద్రంలో ఎనిమిది ల‌క్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి
X

ఉద్యోగ నియామ‌కాల విష‌యంలో టీఆర్ఎస్, బిజెపిల మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగుతోంది. తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ సోమ‌వారం నాడు నిరుద్యోగ దీక్ష నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఇరు పార్టీలు మీరు ఇచ్చిన హామీలు ఏమి అయ్యాయి అంటే...మీరు ఇచ్చిన హామీల సంగ‌తి ఏంటి అంటూ ఒక‌రినొక‌రు ప్ర‌శ్నించుకుంటున్నారు. బండి సంజ‌య్ కు తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హ‌రీష్ రావు ట్విట్ట‌ర్ వేదిక‌గా కౌంట‌ర్ ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతి ఐదింటిలో ఒకటి ఖాళీగా ఉంద‌న్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 8,72,243 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని జితేంద్ర‌సింగ్ రాజ్య‌స‌భ‌లో జులై 2021లో ప్రకటించారన్నారు. .వాటిని ఎందుకు భర్తీ చెయ్యడం లేదు?దేశం కోసం ధర్మం కోసం ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలంటూ హ‌రీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ‌లో ఖాళీల భ‌ర్తీకి జ‌న‌వ‌రి నెలాఖ‌రులోపు నోటిఫికేష‌న్లు ఇవ్వాల‌ని..లేదంటే అసెంబ్లీని ముట్ట‌డిస్తామ‌ని బండి సంజ‌య్ హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే.

Next Story
Share it