Telugu Gateway
Andhra Pradesh

వై ఎస్ అవినాష్ రెడ్డి కి బిగ్ రిలీఫ్

వై ఎస్ అవినాష్ రెడ్డి కి బిగ్ రిలీఫ్
X

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కి తెలంగాణ హై కోర్ట్ లో భారీ ఊరట లభించింది. సిబిఐ ఈ కేసు లో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా...రకరకాల కారణాలు చెప్పి అవినాష్ రెడ్డి ఈ అంశాన్ని సాగదీస్తూ వచ్చారు. . ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించగా...తెలంగాణ హై కోర్ట్ లోనే ఈ సంగతి తేల్చుకోవాలని సూచించింది. సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు వెకేషన్ బెంచ్ వాదనలు విని బుధవారం నాడు తీర్పు వెలువరించింది.

పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు తీర్పు వెలువరించింది. అవినాశ్‌ తల్లి అనారోగ్యం దృష్ట్యా ఇటీవల తెలంగాణ హైకోర్టు బుధవారం వరకు అవినాశ్‌ను అరెస్ట్ చేయొద్దని సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ముందస్తు బెయిల్ రూపంలో అవినాశ్‌కు భారీ ఊరట లభించింది. సిబిఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, ప్రతి శనివారం సిబిఐ ముందు హాజరు కావాలని..విచారణకు పూర్తి గా సహకరించాలని ఆదేశించింది.

Next Story
Share it