Telugu Gateway
Andhra Pradesh

చ‌లో విజ‌య‌వాడ బ‌ల ప్ర‌ద‌ర్శ‌నే..ఇది క‌రెక్ట్ కాదు

చ‌లో విజ‌య‌వాడ బ‌ల ప్ర‌ద‌ర్శ‌నే..ఇది క‌రెక్ట్ కాదు
X

పీఆర్సీ సాధ‌న కోసం ఉద్యోగ సంఘాలు గురువారం నాడు త‌ల‌పెట్టిన చలో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి త‌ప్పుప‌ట్టారు. ఇది ఒక ర‌కంగా బ‌ల ప్ర‌ద‌ర్శ‌నే అన్నారు. ఇలాంటి కార్య‌క్ర‌మాల‌తో సమ‌స్య‌ను జ‌ఠిలం చేయ‌వ‌ద్ద‌ని సూచించారు. స‌మ్మెకు వెళ్ళ‌క‌ముందే రోడ్డెక్కి ఎలా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేస్తార‌ని ప్ర‌శ్నించారు. క‌రోనా కార‌ణంగా వీరికి అనుమ‌తులు రావ‌ని తెలిపారు. స‌మ్మెలు చేసి ప్ర‌భుత్వ మెడ‌లు వంచ‌వ‌చ్చ‌ని వాళ్ల అభిప్రాయంలా ఉంది..ఉద్యోగులు త‌మ కార్యాచార‌ణ ప‌క్క‌న పెట్టి చ‌ర్చ‌ల‌కు రావాల‌ని కోరారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సమస్యలుంటే పాయింట్ల వారీగా చెప్పాలని.. మీరు చెప్పే వాటిని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.

ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లపైనే పట్టుబడుతున్నాయ‌న్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామ‌న్నారు. కరోనా నేపథ్యంలో ఆందోళన వద్దని సజ్జల విజ్ఞప్తి చేశారు. కొత్త పీఆర్సీతో ఎవ్వరి జీతాలు తగ్గలేదని.. ఉద్యమాలతో ఉద్యోగులకు నష్టం చేయవద్దని సజ్జల కోరారు. ఉద్యోగుల‌పై చ‌ర్య‌లు తీసుకునే ప‌రిస్థితి తెచ్చుకోవ‌ద్ద‌న్నారు. ఉద్యోగ సంఘాలు చేస్తున్న మూడు డిమాండ్ల‌కు కాలం చెల్లింద‌న్నారు. ఇప్ప‌టికే వారి ఖాతాల్లో వేత‌నాలు ప‌డ్డాయ‌న్నారు.

Next Story
Share it