Telugu Gateway
Andhra Pradesh

ఏపీ లో అంతే

ఏపీ లో అంతే
X

బహుశా ఇలాంటి ఘటన దేశంలో ఎక్కడా ఇలా జరిగి ఉండక పోవచ్చు. జీతాలు ఇవ్వటం లేదు అని ఏకంగా రాష్ట్ర పరిపాలన కేంద్రం అయిన ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో ఒక మంత్రి ఛాంబర్, పేషీకి ఉద్యోగులు తాళాలు వేసి వెళ్ళిపోవటం అంటే మాములు విషయం కాదు. ఈ వ్యవహారం మీడియా లో రావటం తో కలకలం రేగింది అనే చెప్పాలి. ఆంధ్ర ప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ఛాంబర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేషీలో పనిచేస్తున్న ఏడుగురు సిబ్బందిలో అటెండర్‌లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. వీరికి కాపు కార్పోరేషన్, బీసీ కార్పోరేషన్లు నుంచి జీతాలు అందేలా ఏర్పాటు చేశారు. అయితే పేషీలో సిబ్బందికి 2022 డిసెంబర్ నుంచి జీతాలు రాని పరిస్థితి.

మంత్రికి, అధికారులకు జీతాలపై చెప్పినప్పటికీ పట్టించుకోకపోవటంతో వీళ్ళు ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. తమ జీతాల విషయంలో అనేక మార్లు మంత్రిని, ఓఎస్డీని అడిగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది అని సిబ్బంది చెపుతున్నారు. మరి ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యవహారంలో ఎలా వ్యవహరిస్తుంది అన్నది కీలకంగా మారింది. వాళ్లకు జీతాలు వెంటనే అందేలా చూస్తుందా లేక..చర్యలకు ఉపక్రమిస్తుందా అన్న చర్చ ఉద్యోగుల్లో సాగుతోంది. గత కొంత కాలంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో అందటం లేదు అన్న విషయం తెలిసిందే.

మంత్రి పేషికి తాళం కథనాలపై ఖండన

బిసీ సంక్షేమ మరియు సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి పేషిలోని ఉద్యోగుల జీతభత్యాలు అందక పేషి ఉద్యోగులు తెరవలేదని కొన్ని మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవం...ఉద్యోగులు రోజు మాదిరిగానే విధులకు హాజరవడానికి వచ్చే క్రమంలో జరిగిన ఆలస్యం వల్ల పేషి తెరవడం కొంత సమయం ఆలస్యం అయిన విషయాన్ని అభూత కల్పనతో కొన్ని మీడియా ఛానల్స్ మంత్రి పేషికి తాళలు అంటూ అవాస్తవాలను ప్రచారం చేశాయి...పేషిలో పనిచేస్తున్న ముగ్గురు అటెండర్లలో ఇద్దరు వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉండటం మిగిలిన ఒక్క అటెండర్ వచ్చే సమయం ఆలస్యం కావడం...దానితో పేషి ఆలస్యంగా తెరవడం జరిగిన వాస్తవం. రోజు మాదిరిగానే నేడు పేషిలో ఒఎస్డీ, పిఆర్ఓలు,అటెండర్లు తమ విధిలో పాల్గొని...పేషికి వచ్చే వారి నుండి అభ్యర్థనలు, అర్జిలను అందింపుచుకుంటూ...వారి విధి నిర్వహణలో ఉన్నారు.

Next Story
Share it