Telugu Gateway
Andhra Pradesh

స్థానిక సంస్థల ఎన్నికలపై స్టేకు ఏపీ హైకోర్టు నో

స్థానిక సంస్థల ఎన్నికలపై స్టేకు ఏపీ హైకోర్టు నో
X

పంచాయతీ ఎన్నికల విషయంలో ఏపీ సర్కారుకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిచాలన్న ఎస్ఈసీ నిర్ణయంపై స్టే ఇవ్వాలంటూ ప్రభుత్వం వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల అంశంపై హైకోర్టు మంగళవారం నాడు విచారణ జరిపింది. స్టేకు నిరాకరిస్తూ కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఎస్ఈసీని ఆదేశించి..కేసును డిసెంబర్ 14కి వాయిదా వేసింది. ఏపీ సర్కారు ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏ మాత్రం ఆసక్తిగాలేదు.

వేసవిలో ఎన్నికలు నిర్వహిస్తామని..ప్రస్తుతం కరోనా సమస్య ఉందని ప్రభుత్వం వాదిస్తోంది.ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం తాను ఈ పదవిలో ఉండగానే ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. గత కొంత కాలంగా ఇదే అంశంపై అటు ఏపీ సర్కారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఓ వైపు ఎన్నికలు జరపాలని రమేష్ కుమార్, ఎలాగైనా ఎన్నికలను అడ్డుకుని తీరాలని ప్రభుత్వం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ఈ ఫైట్ లో ఎవరు విజయం సాధిస్తారో వేచిచూడాలి.

Next Story
Share it