Telugu Gateway
Andhra Pradesh

ఏపీ హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు విస్మయం

ఏపీ హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు విస్మయం
X

కీలక పరిణామం. ఏపీ హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. దర్యాప్తులపై స్టేలు విధించవద్దని తాము గతంలో కూడా చాలాసార్లు చెప్పామని పేర్కొంది. తుళ్ళూరు మాజీ తహశీల్దార్ వ్యవహారంపై ఈ అంశంలో కేసు ఏమిటని హైకోర్టు వ్యాఖ్యానించటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తూళ్లూరు భూ కుంభకోణంలో మాజీ తహసీల్దార్‌ సుధీర్‌బాబు సహా పలువురిపై సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించగా, హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

వచ్చే వారం ఈ అంశంపై విచారణ ముగించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ రైతులను బెదిరించి మాజీ తహశీల్దార్‌ అన్నే సుధీర్ బాబు, బ్రహ్మానంద రెడ్డి అసైన్డ్ భూములను లాక్కున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమకు భూములు ఇవ్వకుంటే ల్యాండ్ పూలింగ్ లో భూములు పోగొట్టుకోవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారనే అభియోగాలు నమోదు అయ్యాయి వారిపై. ఈ తహశీల్దార్ కేసును వారం రోజుల్లో తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం ఉండాలని పేర్కొంది.

Next Story
Share it