Telugu Gateway
Politics

దుబ్బాక బిజెపిలో దుమారం

దుబ్బాక బిజెపిలో దుమారం
X

దుబ్బాక ఉప ఎన్నికను బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సీటును సీనియర్ నేత రఘునందన్ రావుకు కేటాయించింది. ఇది అందరూ ఊహించిందే. అయితే ఎవరూ ఊహించని రీతిలో దుబ్బాక బిజెపిలో తీవ్ర దుమారం రేగింది. స్థానిక బిజెపి నేత తోట కమలాకర్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ రఘునందన్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది పార్టీలో కలకలం రేపింది. రఘునందన్‌రావు లాంటి వ్యక్తికి పార్టీ టికెట్‌ ఇవ్వడం సరికాదని ఆయన తీవ్ర ఆరోపనలు చేశారు. దీనిపై పార్టీ అధిష్టానం పునరాలోచించాలని కమలాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ అభ్యర్ధిపై తీవ్ర విమర్శలు చేసిన తోట కమలాకర్‌రెడ్డిని పార్టీ నుంచి తొలగిస్తూ బిజెపి వెంటనే ప్రకటన చేసింది.

ఏది ఏమైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజెపికి ఈ పరిణామాలు ఖచ్చితంగా మింగుపడని వ్యవహారంగానే మారబోతున్నాయి. అధికార టీఆర్ఎస్ తోపాటు బిజెపి, కాంగ్రెస్ లు ఈ ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. రఘునందన్ రావు గతంలో దుబ్బాక నుంచి రెండు పర్యాయాలు బీజేపీ తరఫున పోటీ చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దివంగత రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత బరిలో ఉన్నారు. ​కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీమంత్రి ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి టిక్కెట్ ఖరారు కానుంది. దుబ్బాక శాసనసభ స్థానానికి ఉపఎన్నిక నవంబర్‌ 3న జరగనున్న విషయం తెలిసిందే.

Next Story
Share it