Telugu Gateway
Telangana

సెల్ ఫోన్ పిచ్చి ఎంత పని చేసిందో తెలుసా!

సెల్ ఫోన్ పిచ్చి ఎంత పని చేసిందో తెలుసా!
X

మొబైల్ ఫోన్ల వాడకం పిల్లలకు ఓ వ్యసనంలా మారుతోంది. ఇది ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ఎదుర్కొనే సమస్యే. కరోనా కారణంగా వచ్చిన ఆన్ లైన్ క్లాస్ లతో ఈ సమస్య మరింత పెరుగుతోంది. పిల్లల గంటల తరబడి ఫోన్లను వాడటం వల్ల వారిలో కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. అంతే కాదు...పదవ తరగతి కూడా పూర్తి కాని పిల్లలు ఫోన్లను తమకు పూర్తిగా ఇచ్చేయాలంటూ గొడవలకు దిగుతున్నారు. ఇది చాలా మందిలో పలు సమస్యలకు కారణం అవుతోంది. సెల్ ఫోన్ కోసం తండ్రి,కోడుకులు గొడవ పడ్డారు. చివరకు తండ్రి ఫోన్ విషయంలో గట్టిగా మందలించారని కొడుకు తిరుమలేష్ మందుతాగి ఆత్మహత్య యత్నం చేశారు. బాధితుడిని వెంటనే గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.

మల్లేందోడ్డి గ్రామంలో ముద్దుల గోపాల్ అతని కొడుకు తిరుమలేష్(13) సెల్ ఫోన్ కోసం జరిగిన చిన్నపాటి గొడవ పెద్దది కాగా కోపోద్రేకుడైనా తండ్రి ముద్దుల గోపాల్ కోడుకును విచక్షణ రహితంగా కొట్టడంతో కోడుకు తిరుమలేష్ మనస్తాపం చెంది ఇంట్లో పంట పొలం కోసం తెచ్చిపెట్టినా వ్యవసాయ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడాడ్డు.. తండ్రి ముద్దుల గోపాల్ ఇంటికి వచ్చి చూసేసరికి తిరుమలేష్ అపస్మారక స్ధితిలో ఉండటం చూసి మందుతాగినట్టుగా గమనించి వెంటనే గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు.. చికిత్స చేసిన డాక్టర్లు ప్రస్తుతం తిరుమలేష్ పరిస్థితి విషమంగా ఉందని వెంటనే కర్నూల్ ఆసుపత్రి తరలించాలని సూచించినట్లు తెలుస్తోంది...ఒక చిన్న సెల్ ఫోన్ వివాదం కుటుంబంలో ఒక్కగాను ఒక్కకోడుకు ప్రాణంమీదకు తెచ్ఛిందని గ్రామస్తులు చెబుతున్నారు.

Next Story
Share it