Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ తిరుగుబాటు ఎంపీకి సీబీఐ షాక్

వైసీపీ తిరుగుబాటు ఎంపీకి సీబీఐ షాక్
X

వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసి..ఢిల్లీలో ఉండి ఏపీ ప్రభుత్వంపై ప్రతి రోజూ విమర్శలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సీబీఐ షాక్ ఇచ్చింది. ఆయనపై కేసు నమోదు చేసింది. అంతే కాదు...బ్యాంక్‌ లోన్‌ బకాయిలపై కేసు నమోదు చేసిన సీబీఐ ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ తనిఖీలు నిర్వహించారు. ఈనెల 6న హైదరాబాద్‌, ముంబై సహా 11 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. రఘురామకృష్ణంరాజు సహా 9 మందిపై సీబీఐ చీటింగ్‌ కేసు నమోదు చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టాయి.

ఇండ్‌-భారత్‌ కంపెనీతో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలోనూ తనిఖీలు జరిగాయి. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం సోదాలు కొనసాగాయి. 2019 ఏప్రిల్‌ 30న బ్యాంక్‌ లోన్‌ బకాయిలు పడిన కేసులో సైతం హైదరాబాద్‌, భీమవరంలోని రఘురామకృష్ణంరాజు కంపెనీల్లో సోదాలు చేపట్టారు. వివిధ ప్రాజెక్ట్‌ లకు సంబంధించి రూ.600 కోట్ల మేర ఆయన రుణాలు తీసుకున్నారు. ఇక ఇండ్‌-భారత్‌ పవర్‌ లిమిటెడ్‌కు సంబంధించి రూ.947 కోట్ల మేర బ్యాంకులకు రుణాలు ఎగవేయగా, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థల నుంచి రూ.2655 కోట్ల మేర రఘురామకృష్ణంరాజు లోన్‌ తీసుకున్నట్లు చెబుతున్నారు.

Next Story
Share it