Top
Telugu Gateway

టాలీ వుడ్ లో బాడీ షేపింగ్ పై శ్రద్ధ..మైండ్ షేపింగ్ పై ఉండదా?

టాలీ వుడ్ లో బాడీ షేపింగ్ పై శ్రద్ధ..మైండ్ షేపింగ్ పై ఉండదా?
X

అది టాలీవుడ్ కావొచ్చు. బాలీవుడ్ కావొచ్చు. చాలా మంది హీరో..హీరోయిన్లు వయస్సు చెపితే తప్ప తెలిసే ఛాన్సే ఉండుదు. ఎందుకంటే అరవై సంవత్సరాల వయస్సులో కూడా యువ నటులుగా కన్పించే వారు పరిశ్రమలో ఎంత మందో. ఇది అంత తేలిగ్గా జరిగే వ్యవహారం ఏమీ కాదు. దీని వెనక కఠోర శ్రమ ఉంటుంది. బాలీవుడ్..టాలీవుడ్ పరిశ్రమల్లో హీరోలు..హీరోయిన్లు అందరూ బాడీ షేపింగ్ పై చాలా దృష్టి పెడతారు. దీనికి కోసం చెమట చిందిస్తారు. శరీరంలో ఏ భాగం ఎలా ఉండాలో అలా టార్గెట్ పెట్టుకుని మరీ తెచ్చుకుంటారు. దాని కోసం ప్రతి రోజూ గంటల తరబడి ఎక్సర్ సైజ్ లు చేస్తూ ..నెలల తరబడి కష్టపడతారు. టార్గెట్ రీచ్ అవుతారు. గ్లామర్ వరల్డ్ లో నిలబడాలంటే ఖచ్చితంగా ఫిట్ నెస్ తో ఉండాల్సిందే. సినిమాలో పాత్రకు అనుగుణంగా బరువు పెరగటంతోపాటు..బరువు తగ్గిన వారు కూడా చాలా మంది ఉన్నారు.

రకరకాల ప్యాక్ లో దర్శనం ఇచ్చిన హీరోలు ఎందరో. హీరోయిన్లు కూడా పదేళ్లు పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే బరువు పెరగకుండా చూసుకోవటంతోపాటు ఎక్కడా తేడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. పరిశ్రమలో 95 శాతం వరకూ బాడీ షేపింగ్ విషయంలో ఖచ్చితంగా ఫోకస్ పెట్టి దాని ప్రకారం నడుచుకుంటారు. కానీ బాడీ షేపింగ్ పై ఇంత దృష్టి పెట్టే హీరో..హీరోయిన్లలో కొంత మంది ఎందుకు తమ మైండ్ ను ‘డ్రగ్స్ ’ వంటి వ్యసనాల వైపు మళ్ళకుండా ఆఫుకోలేకపోతున్నారు. చేతి నిండా డబ్బు ఉంటుంది..తరచూ విదేశీ పర్యటనలు..ఎటువైపు చూసినా సెలబ్రిటీ హోదా. పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు. కానీ ఎందుకు డ్రగ్స్ కు బానిస అవుతున్నారు?. మరికొంత మంది ఏకంగా డ్రగ్స్ బిజినెస్ లోకి వెళుతున్నారు అన్నది అత్యంత కీలకంగా మారింది. శరీరాకృతి విషయంలో ఎంతో దృష్టి పెట్టే వీళ్లు ఈ డ్రగ్స వల్ల తమతోపాటు భవిష్యత్ లో తమ పిల్లలు కూడా ఇబ్బందులు పడతారనే విషయాన్ని ఎందుకు ఆలోచించలేకపోతున్నారో అర్ధం కాదని పరిశ్రమకు చెందిన ప్రముఖుడు ఒకరు వ్యాఖ్యానించారు.

తాత్కాలిక ఆనందం..సుఖాల కోసం..పక్కన ఉండే వాళ్ల పొగడ్తలు..అసలు వాళ్లకు ఆరోగ్యం అనే అంశం ఆలోచనకు రాకుండా చేస్తుందని, కొంత మంది ఈ మత్తులోకి వ్యూహాత్మకంగా దింపుతారని చెబుతున్నారు. ఆ సమయంలో వీళ్లు కూడా ఏ మాత్రం ఆరోగ్యం గురించి ఆలోచించరని..అందుకే చాలా మంది డ్రగ్స్ కు బానిసలు మారి తర్వాతర్వాత ఇబ్బందులు పడుతున్నారని..ఇలాంటి వారు టాలీవుడ్ లో కూడా చాలా మంది ఉన్నారు. తమ కెరీర్ కోసం బాడీ షేపింగ్ పై అంతగా దృష్టి పెట్టే హీరోలు..హీరోయిన్లు జీవితం కోసం కాస్త డ్రగ్స్ నుంచి మైండ్ ను డైవర్ట్ చేసుకుంటే ఏ సమస్యలు ఉండవని పరిశ్రమకు చెందిన ప్రముఖుడు ఒకరు వ్యాఖ్యానించారు. అయితే చాలా మంది ఈజీ మనీ కోసం డ్రగ్స్ వాడకంతోపాటు ఇతర అంశాలవైపు కూడా మళ్లుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. బాడీ షేపింగ్ కోసం జిమ్ ట్రైనర్లను పెట్టుకుని మరీ వాళ్లకు జీతాలకు తోడు ఖరీదైన బహుమతులు ఇవ్వటం టాలీవుడ్ లో కొంత మంది సెలబ్రిటీలు చేస్తున్నారు.

Next Story
Share it