Telugu Gateway
Andhra Pradesh

శారదాపీఠాన్ని సందర్శించిన వెల్లంపల్లి

శారదాపీఠాన్ని సందర్శించిన  వెల్లంపల్లి
X

రాష్ట్రంలో వరస పెట్టి దేవాలయాల్లో విగ్రహాలపై జరుగుతున్న దాడులు..తిరుమలలో డిక్లరేషన్ కు సంబంధించి వివాదం నడుస్తున్న తరుణంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మరో మంత్రి రంగనాథరాజు సోమవారం నాడు విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలసి వీరు స్వరూపానందతో సమావేశం అయ్యారు. అనంతరం వెల్లంలపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యమంత్రి చేపట్టే సంక్షేమ పథకాలకు ఆశీస్సులు కావాలని స్వామిని కోరామని తెలిపారు. ప్రభుత్వంపై రాజకీయ కుట్ర సాగుతుందని మంత్రి ఆరోపించారు.

కుట్రలతోనే ఆలయాలపై దాడులు జరిగాయని.. దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందన్నారు. ‘‘కృష్ణా పుష్కరాల సమయంలో ఆలయాలను చంద్రబాబు కూల్చివేశారు. ఆలయాలను పున:నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన. పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి సీఎం కమిటీ వేశారని’’ ఆయన తెలిపారు. బూట్లు వేసుకుని పూజలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు. భక్తుల మనోభావాలు కాపాడే విధంగా ముందుకెళ్తామన్నారు.

Next Story
Share it