Top
Telugu Gateway

ఎన్టీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు..చంద్రబాబు భూస్థాపిత అధ్యక్షుడు

ఎన్టీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు..చంద్రబాబు భూస్థాపిత అధ్యక్షుడు
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై అసమ్మతి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయితే..చంద్రబాబునాయుడు భూస్థాపిత అధ్యక్షుడు అని వ్యాఖ్యానించారు. టీడీపీని మళ్ళీ పునర్ వైభవం తేవటం చంద్రబాబు వల్ల కాదన్నారు. టీడీపీ నుంచి వెళ్లిన వాళ్లు ద్రోహులైతే వాళ్లకు అద్యక్షుడు చంద్రబాబునాయుడే అని వ్యాఖ్యానించారు.పార్టీ గుర్తును జయప్రదంగా ఎలా దక్కించుకున్నాడో అందరికీ తెలుని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ చేర్చుకుంటే టీడీపీ నుంచి ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారన్నారు. తామే వైసీపీకి మద్దతు పలుకుతున్నామని...తమను పార్టీలో చేర్చుకోలేదని వ్యాఖ్యానించారు.

టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తన తనయులను వైసీపీలో చేర్పించిన సమయంలో వల్లభనేని వంశీ వారితోనే ఉన్న విషయం తెలిసిందే.‘ లోకేష్ వల్లనే టీడీపీ 23 సీట్ల కు వచ్చింది. తెలంగాణ లో టీడీపీ క్లోజ్ ఐనట్లే... ఏపీలోను మూత పడుతుంది. మూతపడే పార్టీ లో ఉండాలని ఎమ్మెల్యేలు ఎందుకు అనుకుంటారు? చంద్రబాబు కు 72 ఏళ్ళు....ఆయన శాశ్వతం గా ఉండరు. లోకేష్ బరువుకు టీడీపీ మునిగిపోయింది. పోలవరం చూపించడానికి చంద్రబాబు 400 కోట్లు ఖర్చు చేశారు. ఉన్మాదులు, ఆంధ్రా లో ఆధార్ కార్డ్ లేని వారు మాత్రమే టీడీపీ లో ఉంటారు.’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it