Telugu Gateway
Politics

మహారాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్

మహారాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్
X

మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు బాలీవుడ్ తో అనుసంధానం అయ్యాయి. ముఖ్యంగా కంగనా రనౌత్ ‘కేంద్రీకృతం’గా వివాదాలు అలా సాగుతూ పోతున్నాయి. ఈ వ్యవహారంపై తాజాగా ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కూడా స్పందించారు. తమ మౌనం చేతకానితనం అనుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తాము రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌తో పాటు రాజకీయ పార్టీలతోనూ పోరాటం చేస్తున్నామని అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిననాటి నుంచి ఎన్నో అవాంతరాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్నా అని తాజా వివాదాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఠాక్రే స్పష్టం చేశారు.

మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మొదటితో పోలిస్తే రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు పెరిగిందన్నారు. వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలను చేపడుతోందని వివిరించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా డోర్‌టూడోర్‌ వైద్య సేవలను విస్తరిస్తామన్నారు. ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీను కంగనా రనౌత్ కలిశారు. తన సమస్యలను గవర్నర్ కు వివరించినట్లు తెలిపారు.

Next Story
Share it