Telugu Gateway
Telangana

కాంగ్రెస్ కు స్పీకర్ ఎక్కువ సమయమే ఇచ్చారు

కాంగ్రెస్ కు స్పీకర్ ఎక్కువ సమయమే ఇచ్చారు
X

శాసనసభలో అధికార టీఆర్ఎస్ ప్రతిపక్షం గొంతు నొక్కుతోందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క చేసిన విమర్శలకు టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గావు కేకలు పెడుతున్నారని విప్ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. ‘అసెంబ్లీ లో పార్టీల బలం బట్టి సమయం కేటాయిస్తారు. మంగళ వారం చర్చ లో మాకు 74 నిముషాలు కేటాయించారు. కాంగ్రెస్ కి 5 నిమిషాలు రావాలి...కానీ స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి 10 నిముషాలు ఎక్కువగానే కేటాయించారు. టిఆర్ఎస్ తమ గొంతు నొక్కుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.

ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల ప్రయత్నం. అసెంబ్లీ స్పీకర్ ను అవమాన పరిచే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ మాట్లాడారు. మేము స్పీకర్ ను కలుస్తాం...సంఖ్యా బలంను బట్టి సమయం ఇవ్వాలని విన్నవిస్తాం. ఏ అంశంపై అయిన శాసనసభలో చర్చకు సిద్ధం అని కేసీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ పై పరుష పదజాలంతో మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం. మేము అంత కంటే ఎక్కువ మాట్లాడగలం. మాట్లాడే సత్తా లేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తొండాట ఆడుతున్నారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి... కానీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు వద్దని వ్యాఖ్యానించారు.

Next Story
Share it