Telugu Gateway
Politics

ఎంపీల్లో కరోనా కలకలం..17 మందికి పాజిటివ్

ఎంపీల్లో కరోనా కలకలం..17 మందికి పాజిటివ్
X

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన తరుణంలో ఎంపీలకు పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ రావటం కలకలం రేపుతోంది. ముందస్తుగా చేసిన పరీక్షల్లో ఏకంగా 17 మంది ఎంపీలు కరోనా బారిన పడ్డారు. అందులో చాలా మంది ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ గా తేలవటంతో అవాక్కు అయ్యారు. ఏపీకి చెందిన అధికార వైసీపీ సభ్యులు ఇద్దరు కూడా కరోనా పాజిటివ్ గా తేలిన వారిలో ఉన్నారు. అరకు ఎంపీ మాధవీ, చిత్తూరు ఎంపీ రెడ్డప్పలు కరోనా బారినపడ్డారు.

వైరస్ బారిన పడిన వారిలో అత్యధికంగా బీజేపీకి చెందిన 12 మంది ఎంపీలు ఉన్నారు. శివసేన, డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కళగం), ఆర్‌ఎల్‌పీ(రాష్ట్రీయ లోక్‌తంత్రిక్‌ పార్టీ) ఎంపీలు ఒక్కొక్కరు చొప్పున మహమ్మారి బారిన పడినట్లు తేలింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 24 మంది ఎంపీలకు, 8 మంది కేంద్రమంత్రులకు కరోనా సోకినట్లు తేలగా.. తాజాగా మరో 17 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో వైరస్‌ స్వల్ప లక్షణాలు ఉన్నా.. సభలోకి అనుమతి లేదని స్పీకర్‌ ప్రకటించారు. ఎలాంటి లక్షణాలు లేని వారిని మాత్రమే సమావేశాలకు అనుమతిస్తున్నారు.

Next Story
Share it