Top
Telugu Gateway

టాలీవుడ్ లో టెన్షన్ టెన్షన్ !

టాలీవుడ్ లో టెన్షన్ టెన్షన్ !
X

ఎన్ సీబీ ముందుకు రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ లో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు కొత్తగా ఎవరి పేర్లు రాబోతున్నాయి. ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధించి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) దగ్గర ఉన్న సమాచారం ఏంటి?. రకుల్ ప్రీత్ సింగ్ ఎన్ సీబీ అధికారులకు ఏమి చెబుతుంది?. ఈ విచారణలో పాత విషయాలు కూడా వెలుగులోకి వస్తాయా?. కేవలం హీరోయిన్లకే ఈ అంశం పరిమితం అవుతుందా?. హీరోల వైపు కూడా మళ్ళుతుందా? ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే హీరోయిన్ల కంటే హీరోయిన్ల మేనేజర్లే అత్యంత పవర్ ఫుల్ గా వ్యవహరిస్తారని..వీరు డ్రగ్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ హీరోయిన్లను తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే టాలీవుడ్ లో ఆ పరిస్థితి ఉండదు. కానీ కొంత మంది హీరోయిన్లు డ్రగ్స్ వాడకంతోపాటు పెడ్లర్స్ గా కూడా వ్యవహరిస్తారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందులో కుటుంబ సభ్యులనే భాగస్వాములు చేసి పెద్ద ఎత్తున దందాకు పాల్పడుతున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ముంబయ్ లో విచారించిన ఓ ఏజెన్సీకి సంబంధించిన మహిళతో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోకు వ్యాపార భాగస్వామ్యాలు కూడా ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో ఎన్ సీబీ విచారణను సీరియస్ గా తీసుకుంటే మాత్రం చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులకే బయటకు వస్తారని చెబుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ శుక్రవారం నాడు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) ముందుకు హాజరుకానున్నారు. డ్రగ్స్ అంశంలో తనపై మీడియాలో వార్తలు రాకుండా అడ్డుకోవాలంటూ ఏకంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ రకుల్ ఇప్పుడు ఎన్ సీబీ ముందు హాజరుకాబోతున్నారు. తొలుత తనకు సమన్లు రాలేదని ఓసారి ..తర్వాత అందాయని మరోసారి రకరకాల మాటలు మార్చింది ఈ భామ. ఎన్ సీబీ అధికారులు తమకు ఎన్ని మార్గాల్లో ప్రయత్నించినా రకుల్ అందుబాటులోకి రాలేదని తెలిపి..నోటీసులు పంపామని స్పష్టం చేశారు. డ్రగ్స్ అంశానికి సంబంధించి టాలీవుడ్ లో రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఇవి కేవలం విచారణలో మాత్రమే తేలాల్సి ఉంది. రకుల్ తర్వాత శనివారం జరిగే ఎన్‌సీబీ విచారణలో పాల్గొనేందుకు దీపిక గురువారం రాత్రి గోవా నుంచి ముంబై చేరుకున్నారు.

Next Story
Share it