Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

వైద్య సిబ్బందిపై ఇంత నిర్లక్ష్యమా?

0

ఏపీ సర్కారు తీరును జనసేన తప్పుపట్టింది. కరోనా సంక్షోభ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఈ విషయంలో  నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుండటం దురదృష్టకరం అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోవిడ్-19 విధుల కోసం నియమించుకున్న మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్ట్ వైద్యులు, స్టాఫ్ నర్సులతోపాటు ఇతర సిబ్బందికి గత రెండు నెలలకు జీతాలు చెల్లించడం లేదు.

- Advertisement -

కరోనా అంటే ప్రతి ఒక్కరూ భయపడిపోతున్న సమయంలో ఎంతో ధైర్యంగా వృత్తిపట్ల నిబద్ధతతో విధులకు వచ్చినవారికి కనీసం జీతం కూడా ఇవ్వకపోవడం కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. ఎక్కడెక్కడో కరోనా విధులకు వారిని నియమిస్తే ఆ ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు చెల్లించుకొంటూ ఆహార, నిత్యావసరాలకు వారు ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వ్యయప్రయాసలను ఓర్చుకొంటూ ప్రాణాలను సైతం లెక్కించకుండా ఎంతో గుండె ధైర్యంతో విధులు చేపడుతున్నారు. నెలవారీ జీతం చెల్లింపులకూ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు అని విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.