Telugu Gateway
Telangana

నూతన సచివాలయం పేరుతో ఆర్ధిక దోపిడీ

నూతన సచివాలయం పేరుతో  ఆర్ధిక దోపిడీ
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన గురావారం నాడు ఎన్జీటీకి సంబంధించిన నిజనిర్ధారణ కమిటీకి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి కట్టడాలు చేపట్టరాదంటూ బ్రిటీష్ కాలం నాటి మ్యాపుతో సహా ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా...2001లో హైకోర్టు వెలువరించిన తీర్పును కూడా కమిటీ దృష్టికి తీసుకెళ్ళినట్లు రేవంత్ రెడ్డి మీడియాకు వివరించారు. సీఎం కెసీఆర్ కేవలం మూడ నమ్మకాలు..విశ్వాసాల కోసం సచివాలయంలోని గుడి, మసీదును కూలగొట్టారని ఆరోపించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పాత మ్యాపులను మాయం చేసిందన్నారు.

నిజనిర్ధారణ కమిటీని తప్పుదోవ పట్టించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పాత సచివాలయం కూల్చివేతలకు సీఎస్ కారణం. కూల్చివేతలకు నిరసన తెలిపే వారిని డీజీపీ అడ్డుకుంటున్నారు. కమిటీ హైదరాబాద్ వస్తుందని తెలిసి ఐఏఎస్ సునీల్ శర్మ ఓ ప్రకటన చేశారని, తమకు అన్ని రకాల అనుమతులు వచ్చాయని త్వరలోనే టెండర్లు పిలిచి నూతన సచివాలయం భవన పనులు ప్రారంభిస్తామని తెలిపారన్నారు. అసలు పనులు మొదలుకాక ముందే రాత్రికి రాత్రి మూడు వందల కోట్ల రూపాయలు అంచనాలు పెరిగాయంటే తెలంగాణ సమాజం గుర్తించాలి. ఇందులో ఆర్ధిక దోపిడీ ఒక కోణం. పర్యావరణ కోణం ఇంకోటి. పనులు పూర్తయ్యే నాటికి 1200 కోట్ల రూపాయలకు పెరిగే అవకాశం ఉందని ఆరోపించారు.

Next Story
Share it