Top
Telugu Gateway

కార్పొరేట్లకు రైతులను బానిసలుగా మారుస్తున్నారు

కార్పొరేట్లకు రైతులను బానిసలుగా మారుస్తున్నారు
X

కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులను కార్పొరేట్లకు బానిసలుగా మార్చుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రయత్నాన్ని తామెన్నడూ సఫలం కానివ్వమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

ఈ మేరకు రాహుల్ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలను నాశనం చేసిన తర్వాత రైతులకు మద్దతు ధర ఎలా లభిస్తుందో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ వ్యవసాయ బిల్లుల్లో కనీస మద్దతు ధరకు ప్రభుత్వం ఎందుకు గ్యారెంటీ ఇవ్వలేకపోతుందంటూ ప్రశ్నించారు.

Next Story
Share it