Telugu Gateway
Andhra Pradesh

ఇంగ్లీష్ మీడియం....హైకోర్టు ఆదేశాలపై స్టేకు సుప్రీం నో

ఇంగ్లీష్ మీడియం....హైకోర్టు ఆదేశాలపై స్టేకు సుప్రీం నో
X

ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని ఏపీ సర్కారు కోరగా..అందుకు సుప్రీం నో చెప్పింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది. అప్పుడే స్టే విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. పిటీషన్ పై నోటీసులు ఇవ్వటానికే సుప్రీం మొగ్గుచూపింది. ఏపీలో ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తూ సర్కారు జీవోలు 81,85 జీవోలు తీసుకొచ్చింది. ఈ జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ప్రాథమిక విద్య మాతృ భాషలోనే ఉండాలని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం సుప్రీంని ఆశ్రయించింది.

జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ గురువారం నాడు ఈ కేసు విచారణ చేపట్టింది. ఏపీ సర్కారు తరపున సీనియర్ న్యాయవాది కె. విశ్వనాథన్ వాదనలు విన్పిస్తూ మాతృ భాషలోనే బోధన జరగాలని విద్యా చట్టంలో ఎక్కడా లేదని, ప్రభుత్వ పాఠశాల్లో ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ తెచ్చిన జీవోలను కొట్టివేయటం సరికాదని వాదించారు. ఈ పిటీషన్ పై కేవియట్ వేసిన విద్యార్ధుల తల్లిదండ్రులు, ఫ్రొఫెసర్లు రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలపై స్టేకు మాత్రం నిరాకరించారు.

Next Story
Share it