Telugu Gateway
Cinema

దీపికా..రకుల్..శ్రద్ధాకపూర్ కు ఎన్ సీబీ సమన్లు

దీపికా..రకుల్..శ్రద్ధాకపూర్ కు ఎన్ సీబీ సమన్లు
X

బాలీవుడ్, టాలీవుడ్ డ్రగ్స్ డొంక కదులుతోంది. బాలీవుడ్, టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా ఉన్న వారికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) సమన్లు జారీ చేసింది. మూడు రోజుల్లో వీరిని విచారించనున్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఉదంతరం అనంతరం ఈ వ్యవహారం డ్రగ్స్ చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్ సీబీ తాజాగా దీపికా పడుకొణే, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ తదితరులకు నోటీసులు జారీ చేశారు. వీరితోపాటు దీపికా మేనేజర్ కరిష్మ, సుశాంత్ మేనేజర్ శృతి మోదీని కూడా ఎన్ సీబీ విచారించనుంది.

బాలీవుడ్ హీరోయిన్ల వాట్సప్ చాట్ ద్వారానే పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటి ఆధారంగానే విచారణ జరుగుతోంది. అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితురాలు రియాచక్రవర్తి రకుల్ ప్రీత్ సింగ్ తోపాటు సారా అలీఖాన్, సిమోన్ ఖంబట్టా పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరికొంత మంది పేర్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story
Share it