Telugu Gateway
Politics

కెసీఆర్ పై మల్లు భట్టివిక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు

కెసీఆర్ పై మల్లు భట్టివిక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా నుంచి ప్రజల ప్రాణాలను కాపాడలేని ముఖ్యమంత్రి కేసీఆర్ అతి పెద్ద నేరస్తుడు అని భట్టి ఆరోపించారు. కరోనా మరణాలకు కెసిఆర్ భాద్యత వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల, ధన, మన, ప్రాణాలను కాపాడడం ప్రభుత్వం ప్రాధమిక భాద్యత అన్నారు. తెలంగాణలోని ఆస్పత్రులను సందర్శించి అక్కడ కరోనాకు అందుతున్న వైద్య పరిస్థితులను పరిశీలించి మల్లు భట్టి విక్రమార్క ఆ వివరాలను కాంగ్రెస్ నేతలతోపాటు మీడియాకు వివరించారు. కేసీఆర్ చేతగాని పాలన వల్లే తెలంగాణలో కరోనా మరణాలు సంభవించాయని ఆయన మండిపడ్డారు. శనివారం భట్టి విక్రమార్క మల్లు గాంధీ భవన్ ఆవరణలోని ఇందిరాభవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొడెం వీరయ్య, జగ్గారెడ్డి, సీతక్క, కాంగ్రెస్ నాయకులు బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా వైద్యులు, సహాయ సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్ లేరని చెప్పారు. కరోనా వంటి మహమ్మారి వచ్చిన పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలించి, పేదలు పడుతున్న ఇబ్బందులు గమనించి రాష్ట్ర ప్రజలముందుకు తీసుకువచ్చే ఉద్దేశంతోనే మీడియా సమావేశం, ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించినట్లు ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తక్కువ సిబ్బందితో కరోనాను వైద్యులు బాగా ఎదుర్కోన్నారని అన్నారు. వైద్యసిబ్బందికి, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు పీపీఈ కిట్లు అందించకపోయినా.. వారు ప్రాణాలకు తెగించి వైద్యం అందించారని అన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని, ప్రజల్ని గాలికి వదిలేసిందని భట్టి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఏ ఆసుపత్రి చేసి చూసిన ఏమున్నది గర్వకారణం.. అన్ని ఆసుపత్రుల్లోనూ గోసలే.. బాధలే.. వసతుల లేమి.. డాక్లర్ల కొరత.. అంటూ భట్టి శ్రీశ్రీ కవితను వినిపించారు.

తెలంగాణలో ఉన్న ఆసుపత్రు అన్నీ గత ప్రభుత్వాలు కట్టినవేనని.. ఈ ఆరున్నర సంవత్సరాలుగా కేసీఆర్ సర్కార్ కొత్తగా కట్టిందేమీ లేదని అన్నారు. ఇన్నేళ్లలో కొత్తగా ఆసుపత్రులకు పరికరాలు అదించింది లేదని.. సిబ్బందిని నియమించింది లేదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈటల రాజేందర్ మాత్రం తన ఉద్యమంతా ఉద్యోగాలు కోసమే అన్నడు.. ఇతర శాఖల ఉద్యోగాల సంగతి దేవుడెరుగు తన శాఖలోని ఖాలీగా ఉన్న వేల ఉద్యోగాలను భర్తీ చేయలేదని భట్టి విమర్శించారు. జిల్లాల్లో ఎవరైనా కరోనా బారిన పడి ఆసుపత్రికి వస్తే అరకొరగానే పరీక్షలు చేస్తున్నారని ఆయన చెప్పారు. కరోనా వచ్చిన వారిని, లక్షణాలు కనిపించనివారిని హోమ్ క్వారంటైన్ కు పంపుతున్నారని అన్నారు. ఇలా చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగాయని చెప్పారు.

ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఐసోలేషన్ క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే కరోనా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్యం షాపులు, బెల్టు షాపుల వల్లే కరోనా పెరిగిందని అన్నారు. కరోనా పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు పేదలను పీడించి, డబ్బులు వసూలు చేస్తున్నాయని అన్నారు. కేవలం ఒక కరోనా రోగి దగ్గర నుంచి యశోదా ఆసుపత్రిలో రూ.29 లక్షల బిల్లు వసూలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యమంత్రి మాత్రం కరోనను కేవలం రూ.10 వేలు మాత్రమే అవుతుందని చెప్పారు.. మరి ఇంటా బిల్లు ఎలా వసూలు చేసారు.. ఎవరు చేయమన్నారు.. అంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు. మొత్తం ఈ పీజులపై ఒక IAS స్థాయి అధికారితో కమిటీ వేసి నియంత్రణ చేయాలని అన్నారు.

జిల్లా ఆసుపత్రుల్లో కింద స్థాయి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై తప్పుడు ఎంట్రీలు చేయాలంటూ ఒత్తిడులు వస్తున్నాయని భట్టి చెప్పారు. అందుకు ఉదాహరణగా హుజురాబాద్ ఆసుపత్రి ఘటనను వివరించారు. తప్పుడు ఎంట్రీలు చేయను అన్నందుకు ప్రవీణ్ యాదవ్ అనే ఉద్యోగిని సస్పెండ్ చేసారని.. అతను కోర్ట్ కు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా తిరిగి చేరవహుకోలేదని.. అన్నారు. అంతేకాక తప్పుడు పోలీస్ కేసులతో వేధిస్తే.. అతను గుండే ఆగి చనిపోయాడని చెప్పారు. ఈ కేసులో న్యాయం చేయమని అడిగిన పాపానికి కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డిని నానారకాలుగా ఈ ప్రభుత్వం వేధిస్తోందని భట్టి మీడియాకు వివరించారు.

Next Story
Share it