Telugu Gateway
Andhra Pradesh

పరిశ్రమలకిచ్చిన భూమిలో రియల్ ఎస్టేట్ చేయవచ్చా?

పరిశ్రమలకిచ్చిన భూమిలో రియల్ ఎస్టేట్ చేయవచ్చా?
X

తప్పు చంద్రబాబుది..శిక్ష రైతులదా?

కొడాలి నాని వాదనలో లాజిక్ ఎంత?

సర్కారు ఏపీలో ఓ పరిశ్రమ ఏర్పాటుకు పది ఎకరాల భూమి కేటాయిస్తుంది. ఒప్పందం ప్రకారం ఆ భూమిలో సదరు కంపెనీ లేదా పారిశ్రామికవేత్త పరిశ్రమే పెట్టాలి. లేదంటే నిబంధనల ప్రకారం సర్కారు ఆ భూమిని వెనక్కి తీసుకుంది. లేదు లేదు సర్కారు నాకు భూమి ఇఛ్చేసింది కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటా అంటే సాధ్యం అవుతుందా?. నిబంధనల ప్రకారం అయితే కాదు. కానీ అమరావతిలో పేదల ఇళ్ళ స్థలాలకు జెఏసీ అడ్డుపడింది కాబట్టి..పేదలకు స్థలం ఇవ్వనన్న చోట అసెంబ్లీ కూడా ఉండాల్సిన అవసరం లేదని..ఈ విషయం సీఎం జగన్ కు చెప్పానని ప్రకటించి మంత్రి కొడాలి నాని కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. బలవంతంగా లాక్కున్నా..సమ్మతితో ఇచ్చినా గత ప్రభుత్వానికి అమరావతి రైతులు భూములు ఇఛ్చారు. అలా ఇచ్చిన భూములను ఏమేమి చేస్తామో..అక్కడ ఎన్ని సిటీలు కడతామో..ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామో అప్పటి ప్రభుత్వ రంగ సంస్థ సీఆర్ డీఏ చెప్పింది.

భూములు ఇచ్చిన రైతులకు ప్రతిఫలంగా వార్షిక కౌలుతోపాటు అభివృద్ధి చేయనున్న ప్రాంతంలో వాణిజ్య ఫ్లాట్లు కూడా ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అధికారంలోకి వస్తే అమరావతిని మేం ఎందుకు మారుస్తాం..జగన్ ఇక్కడే ఇళ్ళు, ఆఫీసు కట్టుకున్నాడు వంటి మాటల సంగతి పక్కన పెడితే సర్కారు ఇఫ్పుడు ఏమి చేయాలి. ప్రభుత్వం పరిశ్రమ కోసం ఇఛ్చిన భూమిని ఆ పారిశ్రామికవేత్త ఇస్టానుసారం వాడుకోవటానికి ఎలా అవకాశం లేదో..సర్కారు కూడా రాజధాని కోసం అని రైతులు ఇఛ్చిన భూములను ఇష్టానుసారం వాడుకోవటానికి వీలు ఉండదు. భూములు తీసుకున్న చంద్రబాబు సర్కారు చూపించిన సినిమా వేరు. జగన్ అధికారంలోకి వచ్చారు...మూడు రాజధానులు అన్నారు. దీంతో రాజధాని కోసం అని రైతులు ఇఛ్చిన భూ వినియోగం పూర్తిగా మారిపోతోంది. దీనికి అటు రైతులు...ఇటు ప్రభుత్వం భూ వినియోగ వ్యవహారంపై ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.

ఒక రాజధాని కాస్తా మూడు రాజధానులు కావటంతో రైతులకు ఇచ్చిన వాణిజ్య స్థలాలకు కూడా విలువ రాదు. అందుకు ప్రత్యామ్నాయంగా సర్కారు రైతులతో ఒక అవగాహన రావాలే కానీ...మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం అంటే అది సాధ్యం అయ్యే పనేనా?. ప్రతిపక్షంలో ఉండగా రైతుల భూములను చంద్రబాబు బలవంతంగా లాక్కుంటున్నారని జగన్ ఆరోపించారు. అమరావతి రైతులతో ఈ సర్కారు ఓ ఒఫ్పందానికి వస్తే..ఆ భూములను ఎలా ఉపయోగించుకున్నా ఎవరూ ఆక్షేపించారు. కానీ ఒప్పందం మౌలిక స్వరూపానికే విఘాతం కలిగినందున రైతులు తమ విషయంలో క్లారిటీ వచ్చే వరకూ పోరాటం చేయటం తప్పేమీ కాదు. బాధిత రైతులకు భరోసా కల్పించేలా ప్రకటన చేసి ఒప్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఎవరైనా ముందు ఆఫీసు కడతారు. అప్పటి వరకూ దగ్గర ఉన్న చోట నుంచి ఆఫీసుకు వెళతారు. కానీ చంద్రబాబు మాత్రం ముందు వేల కోట్లు పెట్టి వేలాది ఇళ్ళు కట్టి..ఆఫీసు సంగతి వదిలేశారు. ఇప్పుడు ఆ ఫలితమే రైతులు అనుభవిస్తున్నారు.

Next Story
Share it