Telugu Gateway
Latest News

అమ్మకు 500 కోట్లు..అబ్బాయికి 310 కోట్లు బాకీ ఉన్నా

అమ్మకు 500 కోట్లు..అబ్బాయికి 310 కోట్లు బాకీ ఉన్నా
X

మా అన్న ఇంట్లో అద్దె లేకుండా ఉంటున్నా

అనిల్ అంబానీ సంచలన వ్యాఖ్యలు

‘నా దగ్గర ఇప్పుడు అసలు డబ్బులే లేవు. అత్యంత సాదారణ జీవితం గడుపుతున్నా. ఒక్క కారు మాత్రమే వాడుతున్నా. మా అన్న ఇంట్లో అద్దె లేకుండా జీవనం సాగిస్తున్నా. నా ఖర్చులు చాలా తక్కువ. అవి కూడా మా అవిడ, కుటుంబమే చూసుకుంటోంది. నేను ఎలాంటి విలాస జీవితాన్ని గడపటం లేదు. మా అమ్మకు 500 కోట్లు, మా అబ్బాయి అన్ మోల్ 310 కోట్ల రూపాయలు బాకీ ఉన్నా’ ఇవీ అనిల్ అంబానీ వెల్లడించిన సంచలన విషయాలు. లండన్ కోర్టులో విచారణ సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. చైనా బ్యాంకులకు 700 మిలియన్ డాలర్ల రుణం చెల్లించకుండా అనిల్ అంబానీ రకరకాల కారణాలు చెబుతున్నారు. దీంతో ఆయన ఆస్తుల వివరాలను బహిర్గతం చేయాలంటూ బ్యాంకులు లండన్ కోర్టును ఆశ్రయించాయి. ఈ విచారణ సందర్భంగానే అనిల్ అంబానీ ఈ విషయాలు అన్నీ వెల్లడించారు. 2020 జనవరి-జూన్ మధ్య కాలంలో చట్టపరమైన ఖర్చుల కోసం 9.9 కోట్ల రూపాయలను వెచ్చించినట్టు తెలిపారు. మూడు చైనా బ్యాంకుల రుణాల ఎగవేత కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూకే కోర్టు విచారణకు హాజరైన అనిల్ అంబానీ ఈ విషయం ప్రకటించారు.

విచారణలో భాగంగా యుకె కోర్టు లగ్జరీకార్ల సముదాయం గురించి అంబానీని ప్రశ్నించినప్పుడు ప్రస్తుతం ఒకకారును మాత్రమే ఉపయోగిస్తున్నానని,రోల్స్ రాయిస్ కారు లేనే లేదంటూ మీడియా ఊహాగానాలను అనిల్ తోసిపుచ్చారు. తన భార్య నగలు అమ్మి కోర్టు ఖర్చులు భరిస్తున్నట్టు అనిల్ అంబానీ తెలిపారు. టీనా అనిల్ అంబానీ కలెక్షన్ గురించి కూడా బ్యాంకుల తరపున వాదిస్తున్న కౌన్సిల్ ప్రశ్నించింది. అయితే అదంతా టీనాకు చెందిందే అని, కేవలం టీనా భర్తగా తన పేరు ఉందని చెప్పారు. 110,000 డాలర్ల విలువైన ఆర్ట్ పీస్ మాత్రమే తనదని వెల్లడించారు. ఆర్ధిక సంక్షోభం కారణంగా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా 2019 , 2020 లో తనకు ఎలాంటి ఫీజులు రాలేదని ఆయన కోర్టుకు తెలిపారు. దక్షిణ ముంబైలోని తన ఇంటికి కరెంటు ఖర్చు గత ఎనిమిది నెలల్లో 60.6 లక్షలని ప్రకటించారు. ప్రైవేట్ హెలికాప్టర్, భార్యకు బహుమతిగా ఇచ్చిన ప్రైవేట్ లగ్జరీ యాచ్ట్ వినియోగం ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. దక్షిణ ముంబైలోని తన ఇంటిలో ఎనిమిది నెలల్లో 60.6 లక్షల రూపాయల విద్యుత్ ఖర్చులను అనిల్ అంబానీ ప్రకటించారు. అనిల్ అంబానీ వాస్తవాలను దాచిపెడుతున్నారని బ్యాంకుల తరఫున హాజరైన బంకిమ్ థంకీ క్యూసీ ఆరోపించారు. తమకు రావాల్సిన రుణ బకాయిలను చట్టపరమైన మార్గాల ద్వారా పొంది తీరుతామని వ్యాఖ్యానించారు.

అనిల్ కు చెందిన టెలికామ్ వ్యాపారం విస్తరణ కోసం మూడు చైనా బ్యాంకుల నుండి 700 మిలియన్ డాలర్ల రుణానికి వ్యక్తిగత హామీ ఇచ్చారు. ప్రస్తుతం రిలయన్స్ టెలికామ్ కంపెనీ దివాలా తీసింది. దీంతో ఆ బ్యాంకులు అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయించాయి. మూడు చైనా బ్యాంకులు ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్ ముంబై బ్రాంచ్, చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా అనిల్ అంబానీపై 700 మిలియన్ డాలర్ల రుణాల చెల్లింపుల కోసం దావా వేసిన సంగతి తెలిసిందే. జూన్12 లోపు మూడు చైనా బ్యాంకులకు రూ .5,281 కోట్ల రుణాన్ని, రూ.7 కోట్లు చట్టపరమైన ఖర్చులను చెల్లించాలని మే 22న ఆదేశించింది. కాని పక్షంలో తన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులను అఫిడవిట్ ద్వారా ప్రకటించాలని కోర్టు ఆదేశించింది. ఈ చెల్లింపుల్లో అంబానీ విఫలం కావడంతో చైనా బ్యాంకులు మరోసారి బ్రిటన్ హైకోర్టును ఆశ్రయించాయి.

Next Story
Share it