Telugu Gateway
Telangana

హైదరాబాద్ లో మెట్రో సేవలు ప్రారంభం

హైదరాబాద్ లో మెట్రో సేవలు ప్రారంభం
X

సుదీర్ఘ విరామం అనంతరం హైదరాబాద్ ప్రజలకు సోమవారం మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్రం ప్రకటించిన అన్ లాక్ 4లో భాగంగా మెట్రో సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా ఎల్బీ నగర్-మియాపూర్ రూట్ లో సర్వీసులు మొదలు అయ్యాయి ఉదయం 7 నుంచి 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు తొలి దశలో సర్వీసులు నడుస్తాయి. మంగళవారం నుంచి నాగోల్‌– రాయదుర్గం రూట్లో మెట్రో సేవలు ప్రారంభమవుతాయి.

బుధవారం నుంచి జేబీఎస్‌– ఎంజీబీఎస్‌ సహా మూడు రూట్లలో 69.2 కి.మీ రూట్లో మెట్రో రైళ్లు పరుగెత్తనున్నాయి. బుధవారం నుంచి ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు మూడు మార్గాల్లో నిత్యం సుమారు 3.5– 4 లక్షల మంది జర్నీ చేసేవారు. తొలి రోజు చూస్తే ప్రయాణికుల సంఖ్య చాలా పరిమితంగానే ఉందని చెప్పొచ్చు.

Next Story
Share it