Telugu Gateway
Telangana

నివాసయోగ్య నగరాల్లో హైదరాబాద్ కు ఫస్ట్ ప్లేస్

నివాసయోగ్య నగరాల్లో  హైదరాబాద్ కు ఫస్ట్ ప్లేస్
X

దేశంలో నివాసయోగ్యమైన , ఉపాధి కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై 34 నగరాల్లో జరిపిన సర్వేలో హైదరాబాద్ అత్యత్తమమైన నగరంగా సర్వప్రధమ స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానం హైదరాబాద్ కు దక్కగా రెండవ స్థానంలో ముంబయ్, పూణే, బెంగుళూరు, చెన్నయ్ లు వరుసగా మూడు, నాలుగు, ఐదవ స్థానాలను దక్కించుకున్నాయి. హాలిడిఫై.కామ్ అనే వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో ఈ ఫలితం వచ్చింది. నివాసయోగ్యం, వృత్తి ఉపాధుల నిర్వహణ అంశాలపై ఈ మేరకు సర్వే కొనసాగింది.ఈ సైట్ ప్రధానంగా పర్యాటకులు, తమ ప్రాధాన్యతలపై గమ్యస్థానాలను ఎంపిక చేసుకోవడానికి ఇబ్బందులు లేకుండా చేయడంలో తోడ్పడుతుంది.

దేశంలోని అత్యత్తమ నివాసయోగ్య నగరంగా ఎంపిక చేయడంలో సాంస్కృతిక సమ్మేళనం ప్రాతిపదికన రూపుదిద్దుకున్న నగరాలపై సర్వే చేశారు. ఇందులో వెల్లడైన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. సెప్టెంబరు నెల నుంచి మార్చి నెల వరకు హైదరాబాద్ లో పర్యటించడానికి విశిష్టమైన కాలంగా ఇందులో పేర్కొన్నారు. ఇక్కడి పర్యాటక కేంద్రాల్లో చరిత్రాత్మక చార్మినార్ , గోల్కొండ కోట, స్వప్నం సాకారమైనట్టుగా రూపుదాల్చిన రామోజీ ఫిల్మ్ సిటీ మొదలైనవి పర్యాటకుల దృష్టిని ఆకర్షించితీరుతాయి. హైదరాబాద్ నగరం శరవేగంగా దక్షిణ భారత న్యూయార్క్ నగరంగా అభివృద్ధి చెందుతోందని, తెలంగాణలో పర్యటించే వారికి విశిష్ట గమ్యస్థానంగా సర్వేలో వెల్లడైంది.

Next Story
Share it