Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబును నమ్మేది ఎలా?

చంద్రబాబును నమ్మేది ఎలా?
X

తెలుగుదేశం నాయకులు..క్యాడర్ అసలు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని ఎలా నమ్మాలి?. ఎందుకు నమ్మాలి?. ఇప్పుడు పార్టీ నేతల్లో కూడా ఇవే అనుమానాలు వస్తున్నాయి. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండగా...తాను గతంలో అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేశానని..పార్టీని నిర్లక్ష్యం చేశానని పదే పదే ప్రకటించారు. కార్యకర్తలే దేవుళ్ళు...పార్టీకి బలం ఈ సారి మాత్రం ఆ తప్పు జరగదు అంటూ వంగి వంగి దండాలు పెట్టి మరీ ప్రకటించారు. రాష్ట్రం కోసం అధికారులతో ఎక్కువ సమయం గడిపానని..పార్టీని నిర్లక్ష్యం చేశానని గతంలో చాలా సార్లు ప్రకటించారు. పదేళ్ళ ప్రతిపక్షంలో ఉన్న తర్వాత 2014లో అధికారంలోకి వచ్చారు. జరిగింది ఏంటి?. సేమ్ సీన్ రిపీట్. సీనియర్ నేతలు ఏ అంశంపై అయినా ఓ మాట చెప్పటానికి ప్రయత్నించినా..మీకేం తెలుసు...నాకు తెలియదా? అంటూ చెప్పిన వారిపై ఫైర్ అయ్యారు. పదేళ్ళు ప్రతిఫక్షంలో ఉండి..ఎన్నో చేదు అనుభవాలు చవిచూసిన తర్వాత కూడా ఏ మాత్రం మారని చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు మారతారా?.

అదే జరిగే పనేనా?. అంటే ఖచ్చితంగా కాదనే చెప్పొచ్చు. అలా చెప్పటం ఆయన అలవాటు. అధికారంలోకి రాగానే మళ్ళీ తన సహజశైలిలో..తనకు కావాల్సిన వారికి అనుకూలంగా మారటం ఆయన చేసే పని. శుక్రవారం నాడు అనంతపురం నేతలతో మాట్లాడిన చంద్రబాబు ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభ్యున్నతికి ప్రాధాన్యతనిచ్చానని.. ఆ క్రమంలో పార్టీని కాస్త నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమేనని చంద్రబాబు నాయుడు తెలిపారు. భవిష్యత్తులో అలాంటి తప్పు జరగబోదని ఆయన హామీ ఇచ్చారు.’ పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబుకు పార్టీ ప్రాధాన్యత తెలియదు అనుకోవాలా?. మళ్ళీ ఇప్పుడు భవిష్యత్ లో అలాంటి తప్పు జరగదు అంటే ఎవరైనా నమ్ముతారా?. అన్న సందేహాలు పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతున్నాయి.

విభజన తర్వాత తొలిసారి అధికారం ఇచ్చి రాజధాని నిర్మించే చారిత్రక అవకాశం ఇస్తే చంద్రబాబు ఏమి చేశారు?. చాలా మంది టీడీపీ సీనియర్ నేతలు ఎన్నికలకు ముందే నూతన రాజధానిలో సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్ వంటి భవనాలు పూర్తి చేసుకుంటే బాగుంటుందని చెపితే ఇలా చెప్పిన వారిపై అప్పల్లో మండిపడ్డారు చంద్రబాబు. అధికారంలో ఉన్నంత కాలం కాంట్రాక్టర్లు..ఆర్ధిక వ్యవహారాలు తప్ప రాజకీయాలు పెద్దగా తెలియని నారాయణ, కొంత మంది కాంట్రాక్టర్లకే పెద్ద పీట. దీనికి తోడు అధికారంలో ఉండగా నారా లోకేష్ తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు. పార్టీ ఈ ఈ స్థితికి లోకేష్ కూడా కారణం అనే విమర్శలు చేసేవారూ ఉన్నారు. పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి..ఐదేళ్ళు అధికారం అనుభవించిన చంద్రబాబు అప్పుడు మారకుండా..మళ్ళీ ఇప్పుడు మరోసారి అందరం కలసి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే అప్పుడు మారతారు అంట. ఇది జరిగే పనేనా?.

Next Story
Share it