Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో కలెక్టర్ వర్సెస్ డాక్టర్

ఏపీలో కలెక్టర్ వర్సెస్ డాక్టర్
X

గుంటూరు జిల్లాలో గురువారం నాడు ఘటన అధికార వర్గాల్లో కలకలం రేపింది. గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఓ డాక్టర్ ను తీసుకెళ్ళి లోపలేయండి..అరెస్ట్ చేయండి అంటూ తీవ్ర ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. ‘నువ్వెవరు’ అని నన్ను ప్రశ్నిస్తావా? అంటూ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో పెద్ద ఎత్తున సర్కులేట్ అయింది. నరసరావుపేటలో కరోనా వైరస్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌, వైద్యుడు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానికంగా కరోనా బాధితులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై జిల్లా కలెక్టర్‌ శామ్యూల్ ఆనంద్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

కరోనా కట్టడికి ప్రభుత్వ పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నా అధికారులు సరైన విధంగా విధులు నిర్వర్తించడంలేదని మందలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కలెక్టర్‌ తీరుపై నాదెండ్ల ప్రభుత్వ వైద్యుడు సోములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ.. మాకు చెప్పేందేకు నువ్వెవరివంటూ విధుల్లో ఉన్న కలెక్టర్‌ను ప్రశ్నించాడు. రోగులకు సేవలు అందించేందుకు తాము ఎంతో కష్టపడుతున్నామని చెప్పారు. డాక్టర్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గుంటూరు కలెక్టర్‌ శామ్యూల్ ఆనంద్ కుమార్ వెంటనే అతన్ని అరెస్ట్‌ చేయాలని పోలీసులను అదేశించారు. దీంతో పోలీసులు డాక్టర్ ను అక్కడ నుంచి తీసుకెళ్ళారు. ఆ వైద్యాదికారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Next Story
Share it