Telugu Gateway
Andhra Pradesh

రైతుల భూములతో జీఎంఆర్ దందా

రైతుల భూములతో జీఎంఆర్ దందా
X

కాకినాడ ఎస్ఈజెడ్ లో వాటాలు అరబిందో రియాల్టీకి అమ్మకం

కాకినాడ ప్రత్యేక ఆర్ధిక మండలి (కెఎస్ఈ జెడ్) కోసం రైతుల దగ్గర నుంచి కారుచౌకగా భూముల తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున రాయితీలు పొందారు. సంవత్సరాలకు సంవత్సరాలు గడిచిపోయింది. కానీ కెఎస్ఈజెడ్ లో పెద్దగా కంపెనీలు వచ్చింది లేదు. అభివృద్ధి చేసింది లేదు. రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములను తనఖాపెట్టి పెద్ద ఎత్తున కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. కానీ కెఎస్ఈజెడ్ లో జరిగింది శూన్యం. అసలు కంపెనీలు ఏమీ లేకుండానే ...రాకుండానే దొడ్డిదారి మార్గం అయిన ‘స్విస్ ఛాలెంజ్’ మోడల్ లో తొలుత క్యాప్టివ్ ఓడరేవు కూడా దక్కించుకున్నారు. తర్వాత దాన్ని వాణిజ్యపోర్టుగా మార్చేశారు. ఇప్పుడు అన్నీ అమ్మకానికి పెట్టేశారు. అంటే రైతుల భూములతో..ప్రభుత్వ రాయితీలతో ప్రాజెక్టుల పేరు చెప్పి కార్పొరేట్లే సొమ్ముచేసుకుంటున్న తీరుకు ఇది ఓ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది.

ఉదాహరణకు కెఎస్ఈజెడ్ కోసం అని ఒక్కో ఎకరాను సుమారు నాలుగు లక్షల రూపాయలకు తీసుకుని పలు రాయితీలు పొంది..బ్యాంకు రుణాలు పొంది..కొన్ని సంవత్సరాల పాటు పెద్దగా అభివృద్ధి చేయకుండా ఇప్పుడు అదే భూమిని ఏకంగా మూడు, నాలుగు రెట్ల అధిక అమ్ముకోవటం అంటే జీఎంఆర్ ది రైతుల భూమితో దందా కాకుండా మరేమి అవుతుంది?. జీఎంఆర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కెఎస్ ఈజెడడ్ తన 51 శాతం వాటాను అరబిందో రియాల్టీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు విక్రయించటానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని జీఎంఆర్ అధికారికంగా ప్రకటించింది. ఈ భూములు అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును జీఎంఆర్ గ్రూపు అప్పులు తగ్గించేందుకు ఉపయోగించనున్నట్లు వెల్లడించింది.

Next Story
Share it