Telugu Gateway
Politics

జాతీయ పార్టీపై సీఎం కెసీఆర్ వ్యాఖ్యలు

జాతీయ పార్టీపై సీఎం కెసీఆర్ వ్యాఖ్యలు
X

తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్ఎస్) శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కెసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు అంశంపై క్లారిటీ ఇఛ్చారు. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేదని...సమయం వచ్చినప్పుడు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించారు. కెసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు మీడియాలో ప్రముఖంగా వార్తలు రావటంపై కెసీఆర్ దీనిపై స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు దేశాన్ని సర్వనాశనం చేశాయని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో దేశంలో ఎక్కడాలేని విధంగా రెవెన్యూ చట్టం రానుందని..దీని గురించి ప్రజలకు ఎమ్మెల్యేలు వివరించాలన్నారు.

శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలను ఏ ఒక్కరూ ఆశామాషీగా తీసుకోవద్దని, ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని సభ్యులకు సూచించారు. రెవిన్యూ చట్టంతో రాష్ట్ర రూపురేఖలు మారతాయని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం సందర్భంగా దుబ్బాక దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి సీఎం కెసీఆర్ నివాళి అర్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వే ఫలితాలు చెబుతున్నాయని కెసీఆర్ వెల్లడించారు.

Next Story
Share it