Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో రైతులకు ఉచితంగా బోర్లు

ఏపీలో రైతులకు ఉచితంగా బోర్లు
X

ఏపీ సర్కారు కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దీని కింద రైతులకు ఉచితంగా బోర్లు వేయించనున్నారు. ఈ పథకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు ప్రారంభించారు. ఈ పథకానికి వైఎస్ఆర్ జళకళ అనే పేరు పెట్టారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో మూడు లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయనున్నారు. 'వైఎస్‌ఆర్‌ జలకళ' కోసం ప్రభుత్వం రూ.2,340 కోట్లు ఖర్చుచేయనుంది. ఐదు లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల ద్వారా సాగునీరు అందించనుంది. ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతు కోసం మరో అడుగు ముందుకు వేశామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు ద్వారా వారి మెట్ట భూములకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. శాస్త్రీయంగా భూగర్భ జల సర్వే అనంతరం బోరు వేసే ప్రాంతాన్ని గుర్తిస్తారని తెలిపారు.

దరఖాస్తు నుంచి బోర్‌ డ్రిల్లింగ్‌ వరకు ఎప్పటికప్పుడు రైతుకు సమాచారం అందుబాటులో ఉండే విధంగా దీనిని రూపొందిస్తామని తెలిపారు. వాలంటీర్ల సహకారంతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. బోర్‌ ఎక్కడ వేస్తే నీళ్లు పడతాయన్న సర్వే కూడా చేస్తాం. బోర్‌ వేసేందుకు, సర్వే ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పటికే రైతులు వేసుకున్న బోర్లు ఫెయిలైతే.. మళ్లీ వేయిస్తాం. యూనిట్‌కు 6.80 పైసలు చొప్పున నెలకు రూ.9,272 విద్యుత్‌ బిల్లును భరిస్తాం. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.8,655 కోట్లు చెల్లించాం. గత ప్రభుత్వంలో పగటిపూట విద్యుత్ ఇవ్వాలనే ఆలోచన రాలేదు. గత ప్రభుత్వం హయాంలో ఫీడర్ల కెపాసిటీ 59 శాతం మాత్రమే ఉండేది. రూ.1700 కోట్లు ఖర్చు చేసి ఫీడర్ల కెపాసిటీని 89శాతానికి తీసుకొచ్చాం.’ అని తెలిపారు.

Next Story
Share it