Telugu Gateway
Politics

కెసీఆర్ అసెంబ్లీ అందుకే పెట్టినట్లు ఉంది

కెసీఆర్ అసెంబ్లీ అందుకే పెట్టినట్లు ఉంది
X

ముఖ్యమంత్రి కెసీఆర్ తీరుపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేక కెసీఆర్ పారిపోయారని ఆరోపించారు. ఈ శాస‌న‌స‌భా స‌మావేశాల‌ను కేవ‌లం ఎఫ్‌.ఆర్‌.బీ.ఎం. బిల్లుకోస‌మే నిర్వ‌హించిన‌ట్లుగా ఉంద‌ని అన్నారు. రాష్ట్రాన్ని తాక‌ట్టు పెట్టి.. అప్పులు తెచ్చుకోవ‌డం కోసం అవ‌స‌ర‌మ‌య్యే బిల్లు స‌వ‌ర‌ణ కోస‌మే మీటింగ్ జ‌రిపిన‌ట్లు ఉంద‌ని అన్నారు. ఈ చ‌ట్టం వ‌ల్ల రాష్ట్రం పెద్ద ఎత్తున అప్పుల పాలు అవుతుంద‌ని అన్నారు. కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్షం అడిగే ప్ర‌శ్న‌ల‌కు కేసీఆర్ ద‌గ్గ‌ర స‌మాధానాలు లేకే స‌భ నుంచి ప‌రార‌య్యార‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. అపెంబ్లీ నిర‌వ‌ధిక వాయిదా ప‌డ్డాక సీఎల్పీ నేత బ‌ట్టి, ఎమ్మెల్యేలు సీత‌క్క‌, దుద్ధిళ్ల శ్రీధ‌ర్ బాబు, జ‌గ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించే ధైర్యంలేక టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పారిపోయింద‌న్నారు. ఆరునెల‌ల త‌రువాత స‌భా స‌మావేశాల సంద‌ర్భంగా జ‌రిగిన బీఏసీ సమీటింగ్ లో 28 వ‌ర‌కూ అసెంబ్లీ జ‌రుపుతాం అని చెప్పి, అవ‌స‌ర‌మైతే ప్ర‌తిప‌క్షం అడిగిన‌న్ని రోజులు స‌మావేశాలు నిర్వ‌హిస్తామ‌న్న ప్ర‌భుత్వం ఇప్పుడు ఎందుకు పారిపోయిందని ప్రశ్నించారు.

ద‌క్షిణ తెలంగాణ‌ను ఏడారిలా మార్చేలా ఏపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జీ.ఓ. నెంబ‌ర్ 203పై అసెంబ్లీలో చ‌ర్చ జ‌రిప‌కుండా కేసీఆర్ ఎందుకు పారిపోయారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని ఆయ‌న భట్టి డిమాండ్ చేశారు. ప్ర‌జ‌ల ప‌క్షాన కృష్ణా న‌దీ జ‌లాలను ఏపీ రోజుకు 11 టీఎంసీలు త‌ర‌లించుకుపోతే ఖ‌మ్మం, న‌ల్గండ‌తో పాటు ద‌క్షిణ తెలంగాణ మొత్తం ఎడారిలా మారుతుంది.. ఇంత కీల‌క అంశంపై స‌భ‌లో చ‌ర్చించ‌కుండా చేయ‌డం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ అంశంపై చ‌ర్చి జ‌రిగితే కేసీఆర్ ఈస‌లు రూపం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌న్న భ‌యంతో పారిపోయార‌ని అన్నారు. అధికార, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య జ‌ర‌గాల్సిన చ‌ర్చ‌ను.. ప్ర‌భుత్వం మిత్ర‌ప‌క్షంగా మార్చేసుకున్న ఘ‌న‌త కేసీఆర్ కే ద‌క్కుతుంద‌ని అన్నారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షమే లేకుండా చేయాల‌న్న దుర్భుద్ధితో ప్ర‌జాస్వామ్యానికి విఘాతం క‌లిగించేలా కేసీఆర్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ, వ‌ర్షాల ద్వారా న‌ష్ట‌పోయిన రైతులు, ఆరోగ్య, పంచాయితీ రాజ్ సెక్రెట‌రీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, డ‌బుల్ బెడ్ రూమ్ కోసం ఎదురు చూస్తున్న పేద‌లు, క‌రోనాతో ఉద్యోగాలు కోల్పోయిన వారి స‌మ‌స్య‌లు.. ఎన్నో రాష్ట్రంలో ఉన్నాయ‌ని.. వాటిపై చ‌ర్చించాలల్సి ఉన్నా ఏవీ చర్చకు రాకుండా చేశారన్నారు.

Next Story
Share it