Telugu Gateway
Andhra Pradesh

అలా అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా

అలా అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా
X

ఏపీలో ప్రస్తుతం ఉచిత విద్యుత్ హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం సర్కారు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలని నిర్ణయించటమే. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా.. సర్కారు ఈ నిర్ణయాన్ని సమర్ధించుకునే పనిలో ఉంది. ఇదే అంశంపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

టీడీపీ హయాంలో చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచారని ధర్నాలు చేస్తే కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారని అన్నారు. వైఎస్.. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు విమర్శించారన్నారు. వ్యవసాయ మోటర్లకు స్మార్టు మీటర్లు పెట్టాలని కేంద్ర ఆదేశించిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు బిల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు.

Next Story
Share it