బాలు అంత్యక్రియలు పూర్తి
BY Telugu Gateway26 Sept 2020 5:01 PM IST
X
Telugu Gateway26 Sept 2020 5:01 PM IST
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు ముగిశాయి. కోట్లాది మంది అభిమానులను అశ్రునయనాల మధ్య ఈ కార్యక్రమం సాగింది. కోవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలోనే ఈ కార్యక్రమం సాగింది. తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో బాలు అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించింది. చెన్నయ్ సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌస్ లో అంతిమ సంస్కారాలు జరిగాయి. శ్రౌత శైవ ఆరాధ్య సంప్రదాయం ప్రకారం బాలుని ఖననం చేశారు.
అంతకు ముందు కుటుంబసభ్యులు సంప్రదాయబద్ధంగా వైదిక క్రతువు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యారు. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రితో పాటు సూపర్‌స్టార్ విజయ్, మరికొందరు ప్రముఖులు పాల్గొన్నారు. బాలును కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఫాంహౌస్‌కు వచ్చారు.
Next Story