ఏపీలో బార్లకు సర్కారు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లో శనివారం నుంచి బార్ల సందడి షురూ కానుంది. ఈ మేరకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇఛ్చింది. ఇప్పటికే మద్యం రేట్లు పెంచేసి మందు బాబులకు చుక్కలు చూపిస్తున్న సర్కారు తాజాగా బార్ల విషయంలోనూ అదే పనిచేసింది. కొత్తగా బార్ల లైసెన్స్ లపై 20 శాతం కరోనా రుసుంను వసూలు చేయనుంది. రాష్ట్రంలో 840 బార్ల లైసెన్స్ లను రెన్యువల్ చేయాలని నిర్ణయించారు. ఇవి 2021 జూన్ 30 వరకూ కొనసాగుతాయి. మద్యం విక్రయాలపై కూడా అదనంగా పది శాతం రిటైల్ ట్యాక్స్ ను వసూలు చేయనున్నారు.
దీంతో బార్లలో మద్యం ధర మరింత పెరగటం ఖాయంగా కన్పిస్తోంది. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా బార్లపై ఇటీవల వరకూ నిషేధం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అన్ లాక్ 4లో మినహాయింపులు ఇఛ్చారు ఇఫ్పటికే పలు రాష్ట్రాలు బార్లకు తలుపులు తెరిచాయి. అయితే ఏపీ సర్కారు మాత్రం శనివారం నుంచి బార్లకు అనుమతి మంజూరు చేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బార్ల యాజమానులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.