Telugu Gateway
Andhra Pradesh

రాజకీయాల్లోకి కొత్తతరం వచ్చే సమయం ఇదే

రాజకీయాల్లోకి కొత్తతరం వచ్చే సమయం ఇదే
X

పాలన రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి కొత్త తరం వచ్చే సమయం ఇదేనన్నారు. ప్రభుత్వాలు చేస్తున్న పనులను యువత పట్టించుకోవటం ప్రారంభించాలన్నారు. మనోహర్ ఆదివారం నాడు విద్యార్ధులు, యువత, మెడికోలతో వెబినార్ నిర్వహించారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే పవన్ కల్యాణ్ ఆకాంక్ష అని తెలిపారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. విధానాల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు.

ఈ వెబినార్ లో పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు నాదెండ్ల మనోహర్ స్పందించారు. దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయవచ్చన్నారు. సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి.

Next Story
Share it