Telugu Gateway
Andhra Pradesh

సాదినేని యామినిపై టీటీడీ కేసు

సాదినేని యామినిపై టీటీడీ కేసు
X

బిజెపి నాయకురాలు సాదినేని యామినిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కేసు పెట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 5న అయోధ్యలో జరిగిన రామమందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ లైవ్ ను ఎస్వీబీసీ ఛానల్ ప్రసారం చేయలేదు. దీనిపై ఆమె ఎస్వీబీసీ ఛానల్ పై విమర్శలు చేశారు. ‘ప్రపంచ వ్యాప్తంగా,దేశ వ్యాప్తంగా ఎన్నో ఛానళ్లు అయోధ్య శంకుస్థాపన కార్యక్రమాన్ని లైవ్ ఇచ్చారు.

హిందువులు..కొన్ని శతాబ్దాలుగా హిందువులు ఇఛ్చే మొక్కులు..దానధర్మాలతో, ధార్మిక కార్యక్రమాలు చేపట్టే టీటీడీ..వారి అఫీషియల్ ఛానల్ సాక్ష్యాత్తూ శ్రీరామన్నాయణ అవతారం అయిన రాముడి గుడి భూమి పూజ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రస్తారం చేయలేదని విమర్శించారు. దీంతో ఆమెపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు ఆధారంగా పోలీసులు సాధినేని యామినిపై ఐపీసీ సెక్షన్ 505(2), 500ల కింద కేసు నమోదు చేశారు.

Next Story
Share it