Telugu Gateway
Telangana

ప్రైవేట్ ఆస్పత్రులపై తెలంగాణ సర్కారు సీరియస్!

ప్రైవేట్ ఆస్పత్రులపై తెలంగాణ సర్కారు సీరియస్!
X

విజిలెన్స్ కమిటీ ఏర్పాటు దిశగా అడుగులు..నివేదిక ఆధారంగా చర్యలు

కరోనా చికిత్స విషయంలో ప్రైవేట్ ఆస్పత్రుల అక్రమాలపై సర్కారుకు ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులు కాకుండా కొన్ని ఆస్పత్రులు ఇష్టానుసారం డబ్బులు వసూలు చేస్తూ బాధితులకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రతి నిత్యం ప్రైవేట్ ఆస్పత్రుల వ్యవహారం దుమారం రేపుతూనే ఉంది. ఈ తరుణంలో సర్కారు ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. ప్రైవేట్ ఆస్పత్రుల అక్రమాలపై విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెబుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ కమిటీ వేసి విచారణ జరిపించాలని వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మంత్రికి సూచించారు. ఇప్పటికే ప్రైవేట్ ఆస్పత్రులపై ఏకంగా 800 వరకూ ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం.

Next Story
Share it